కొలంబియా యూటర్న్.. ట్రంప్ నిబంధనలకు ఓకే
అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తూ.. ప్రత్యేక విమానాల్లో వారిని స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ చర్యలను ముందుగా వ్యతిరేకించిన కొలంబియా ఇప్పుడు వెనక్కి తగ్గింది. అగ్రరాజ్యం పెట్టిన నిబంధనలకు అంగీకరించిందని వైట్‌హౌస్ పేర్కొంది.
కొలంబియా వెనక్కి తగ్గి స్వదేశానికి తిరిగి వచ్చిన పౌరులను ఆహ్వానించడంతో… తాము ఆ దేశంపై విధించిన సుంకాలు, పలు ఆంక్షలను నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. ‘‘అమెరికా సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. యూఎస్‌లో చట్టవిరుద్ధంగా ఆశ్రయం పొందుతున్న తమ పౌరులను వెనక్కి పిలిపించుకోవడానికి ప్రపంచ దేశాలు తగిన చర్యలు తీసుకొని తనకు సహకరించాలని’ అని వైట్‌హౌస్ పేర్కొంది. అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో వారివారి స్వదేశాలకు పంపడానికి అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరుపై పలు దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇలా వలసదారులను తీసుకొచ్చే విమానాలను తమ దేశంలోకి అనుమతించబోమని కొలంబియా తేల్చి చెప్పింది. ‘‘కొలంబియా వలసదారులను తీసుకువచ్చే అమెరికా విమానాలను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నామని’ అని ఆ దేశాధ్యక్షుడు గుస్తావో పెట్రో ఇటీవలే చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుంభమేళా చుట్టూ చిట్టడవి.. స్వచ్ఛమైన గాలికి కొదవే లేదు..
శివ శంకర్‌గా మారిన సద్దాం హుసేన్.. ప్రియురాలి కోసం హిందువుగా
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

