అక్షయ్ సినిమాపై వివాదం భగ్గుమంటున్న ఆ వర్గం
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటేస్ట్ మూవీ స్కై ఫోర్స్. 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశం జరిపిన మొదటి వైమానిక దాడి ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆక్టటుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది.
ఈ సినిమాలో స్క్వాడ్రన్ లీడర్ అజ్జమడ బొప్పయ్య దేవయ్య పాత్రపై కర్ణాటకలోని కొడవ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో స్క్వాడ్రన్ లీడర్ దేవయ్యను తమిళుడిగా చిత్రీకరించడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అతను కర్ణాటకలోని కొడగులో కొడవ కమ్యూనిటీకి చెందిన అధికారి అని.. కానీ సినిమాలో మాత్రం అతడిని తమిళుడిగా చూపించారని మండిపడ్డారు. కొడవ కమ్యూనిటీ అనేది కర్ణాటకలోని కూర్గ్ ప్రస్తుతం కొడగులో ఉన్న ఒక జాతి సంఘం. వారు యుద్ధ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ కమ్యూనిటీకి చెందిన న్యాయవాది తాన్య వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య కమ్యూనిటీని తప్పుగా చిత్రీకరించడం వెనుక చిత్రనిర్మాతల ఉద్దేశాలను ప్రశ్నిస్తూ ఆమె ప్రత్యేక వీడియో చేశారు. స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య గుర్తింపును చిత్రనిర్మాతలు తప్పుగా చిత్రీకరిస్తున్నారని సోషల్ మీడియాలో మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య మరణానంతరం మహావీర చక్ర అవార్డు పొందిన ఏకైక భారతీయ వైమానిక దళ అధికారి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డు మధ్యలో పిల్లి.. ఎంటరైన శునకం.. గుండెలకు హత్తుకునే సీన్ ను చూడండి
ఈ అన్నం తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!
Araku: గుడ్ న్యూస్.. అరకు లోయలో పారాగ్లైడింగ్
ఏనుగులు పగబట్టాయా ?? ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం చేసిన గజరాజు
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

