రోడ్డు మధ్యలో పిల్లి.. ఎంటరైన శునకం.. గుండెలకు హత్తుకునే సీన్ ను చూడండి
రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోంది. సాటి మనిషికి సాయం చేసే వారే కానరావడం లేదు. సాయం చేయకపోగా కొందరు ఎదుటి వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల కంటే జంతువులే నయం అనిపిస్తుంటుంది. తాజాగా ఓ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఓ పిల్లి రోడ్డు మధ్యలో ఉండడం చూసి కుక్క అక్కడికి వెళ్లింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి.. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లి రోడ్డు దాటే సమయంలో సడన్‌గా వాహనాలు రావడంతో మధ్యలో ఆగిపోయింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో అటు ముందుకు వెళ్లలేక, ఇటు వెనక్కు వెళ్లలేక ఇబ్బంది పడుతోంది. దూరం నుంచి పిల్లిని గమనించిన కుక్క మెల్లిగా దాని సమీపానికి వెళ్లింది. కుక్కను చూసిన పిల్లి.. తనను ఎక్కడ కొరికేస్తుందేమో అని భయపడింది. కానీ కుక్క మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా పిల్లిని రక్షించేందుకు సిద్ధమైంది. పిల్లిని ఎలాగైనా రోడ్డు దాటించాలని అనుకుంది. కొద్దిసేపటి తర్వాత చివరికి పిల్లి మెడ పట్టుకుని ఎంతో జాగ్రత్తగా రోడ్డు అవతలి వైపునకు తీసుకొచ్చింది. ఫుట్‌పాత్‌పైకి తీసుకొచ్చి.. ‘‘రోడ్డు పైకి వెళ్లకుండా.. జాగ్రత్తగా పక్క నుంచి వెళ్లిపో’’ అని జాగ్రత్తలు చెబుతున్నట్లుగా పిల్లిని వదిలేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ అన్నం తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!
Araku: గుడ్ న్యూస్.. అరకు లోయలో పారాగ్లైడింగ్
ఏనుగులు పగబట్టాయా ?? ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం చేసిన గజరాజు
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

