Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏనుగులు పగబట్టాయా ?? ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం చేసిన గజరాజు

ఏనుగులు పగబట్టాయా ?? ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం చేసిన గజరాజు

Phani CH

|

Updated on: Jan 26, 2025 | 8:34 PM

ఏనుగులు ఇటీవల అడవులను వదిలి పంట పొలాల్లోకి చొరబడి పంటలను నాశనం చేస్తున్నాయి. అంతేకాకుండా వాటిని బెదరగొట్టేందుకు ప్రయత్నించిన రైతులను పొట్టన పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు పొలాల్లోకే కాకుండా ఇళ్లలోకి కూడా చొరబడుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఓ ఏనుగు ఎక్కడికి నుంచి వచ్చిందో ఓఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించి నానా బీభత్సం చేసేసింది.

దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏనుగులు పగబట్టాయా ఏంటి ఇలా దాడి చేస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందినదిగా తెలిసింది. వీడియో ప్రకారం.. జనవరి 18 శనివారం రాత్రి ఒక ఏనుగు ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ ఇంట్లో నలుగురు కార్మికులు ఉన్నట్టుగా తెలిసింది. రాత్రి సమయంలో వచ్చిన అనుకోని అతిథిని చూడగానే ఆ ఇంట్లోని వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. కానీ, చాకచక్యంగా వ్యవహరించి వారు ఏనుగు కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. అలాగే, ఆ ఏనుగు ఏం చేస్తుందో చూడాలని ఈ సంఘటనను వారు ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ ఇంటి ద్వారం చిన్నదిగా ఉండటం, ఏనుగు భారీగా ఉండటంతో అది లోపలికి ప్రవేశించలేకపోయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టిక్‌టాక్‌ కోసం సింహం బోనులోకి వెళ్లాడు.. చివరకు..

నెలకు ₹20తో మీ సిమ్‌ యాక్టివ్‌.. ట్రాయ్‌ రూల్‌ తెలుసా ??

చిరు వ్యాపారులనూ వదలని సైబర్‌ మోసగాళ్లు.. మోగకపోతే మోసపోయినట్లే!

‘బిగ్ బీ’నా మ‌జాకా.. అపార్ట్‌మెంట్‌ అమ్మకంపై 168 శాతం లాభం

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కరణ