‘బిగ్ బీ’నా మజాకా.. అపార్ట్‌మెంట్ అమ్మకంపై 168 శాతం లాభం
అమితాబ్ బచ్చన్ ముంబయిలోని ఓషివారాలోని తన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను తాజాగా రూ.83 కోట్లకు విక్రయించారు. ఈ అపార్ట్‌మెంట్‌ను అమితాబ్ 2021 ఏప్రిల్ లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. తద్వారా ఆయనకు 168 శాతం మేర లాభం వచ్చింది. కాగా, 4, 5, 6 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌లను అందిస్తూ 1.55 ఎకరాలలో విస్తరించి ఉన్న ఓషివారాలోని క్రిస్టల్ గ్రూప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయిన 'ది అట్లాంటిస్'లో ఈ ప్రాపర్టీ ఉంది.
ఇక రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా చూస్తే.. ఈ లావాదేవీ ఈ ఏడాది ప్రారంభంలో నమోదైంది. అంతకుముందు ఈ అపార్ట్‌మెంట్‌ను బిగ్ బీ.. నటి కృతి సనన్‌కు అద్దెకు ఇచ్చారు. నెలవారీ అద్దె రూ. 10 లక్షలు కాగా, రూ. 60 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌తో అపార్ట్‌మెంట్‌ను 2021 నవంబర్ లో అద్దెకు ఇవ్వడం జరిగింది. ఇక ఈ అపార్ట్‌మెంట్ విస్తీర్ణం దాదాపు 5,704 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ఇదిలా ఉంటే.. గతేడాది బచ్చన్ కుటుంబం రియల్ ఎస్టేట్‌లో సుమారు రూ. 100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ప్రధానంగా ఓషివారా, మగథానే లోని నివాస, వాణిజ్య ప్రాపర్టీలపై దృష్టి సారించింది. ఇలా 2020 నుంచి 2024 వరకు అమితాబ్ ఫ్యామిలీ దాదాపు రూ. 200 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కరణ
ఇది ఇల్లు కాదు.. ఔషధ వనం.. అణువణువూ ఆయుర్వేదమే
Darshan: బెయిల్ విషయంలో మళ్లీ టెన్షన్.. టెన్షన్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

