Darshan: బెయిల్ విషయంలో మళ్లీ టెన్షన్.. టెన్షన్

Darshan: బెయిల్ విషయంలో మళ్లీ టెన్షన్.. టెన్షన్

Phani CH

|

Updated on: Jan 26, 2025 | 6:26 PM

కన్నడ స్టార్ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కొన్ని నెలలు జైలు జీవితం గడిపారు. అయితే కర్ణాటక హైకోర్టు దర్శన్, పవిత్ర గౌడ సహా ఏడుగురు ప్రధాన నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరు పోలీసులు నిందితుల బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ క్రమంలో తాజాగా జరిగిన విచారణలో.. ఏడుగురు నిందితులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది రేణుకాస్వామి హత్య కేసులో ఏడుగురు నిందితులకు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరు పై ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాత బెంగుళురు పోలీసులు బెయిల్ ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ పై విచారణ జరగ్గా.. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బెయిల్ రద్దు చేయాలంటూ తమ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో బెయిల్ కానీ రద్దయితే.. దర్శన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డ్రామాలు ఆడుతున్నారా ?? అందర్నీ బకరాలు చేశారా ??

రజాకార్ సినిమాపై కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశంసలు

పదేళ్ల కష్టం ఆ అవార్డుకు సరిపోలేదా! పాపం పృథ్విరాజ్!‌

Samantha: వచ్చే 6 నెలలు సంతోషంగా ఉంటా…

సుకుమార్ బిడ్డ యాక్టింగ్‌కు.. మహేష్‌ బాబు ఫిదా..