పదేళ్ల కష్టం ఆ అవార్డుకు సరిపోలేదా! పాపం పృథ్విరాజ్!
97వ ఆస్కార్ నామినేషన్లను తాజాగా అనౌన్స్ చేశారు. అయితే ఈ లిస్టు నుంచి మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ ‘ఆడు జీవితం’ అవుట్ అయింది. దీంతో పృథ్వీ రాజ్ పడిన కష్టం బూడిద పాలు అయినట్టుగా ఉంది. ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. గతంలో ఆడుజీవితం సినిమా ఆస్కార్‌కి ఎంపికైందని వార్తలు వచ్చాయి.
దాంతో మలయాళ ఇండస్ట్రీ ఫ్యాన్స్ తో పాటు పృథ్వీరాజ్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఆడుజీవితంతో పాటు కంక్వా , ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ కూడా ఆస్కార్ నామినేషన్లు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు లిస్ట్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఆడు జీవితం సినిమా ఈ లిస్టులో లేకుండా పోయింది. దీంతో ఈ మూవీ ఫ్యాన్స్ అందరూ షాకవుతున్నారు. పాపం పృథ్వీ రాజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆడు జీవితం. బ్లెస్సీ దర్శకుడు. 2008లో అత్యధికంగా అమ్ముడైన మలయాళ నవల ‘గోట్ డేస్’. నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకుని బెన్యామిన్ ఈ నవల రాశారు. దీని హక్కులు కొనుగోలు చేసి, దాదాపు పదేళ్ల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశారు దర్శకుడు బ్లెస్సీ. నజీబ్ మహ్మద్ ఉపాధి కోసమని తన స్నేహితుడు హకీం తో కలిసి సౌదీ వెళ్తాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: వచ్చే 6 నెలలు సంతోషంగా ఉంటా…
సుకుమార్ బిడ్డ యాక్టింగ్‌కు.. మహేష్ బాబు ఫిదా..
దిమ్మతిరిగే అప్డేట్.. కన్నప్పలో ప్రభాస్‌కు ఇంట్రో సాంగ్
పేరుకే సీరియల్ నటి.. వయసు 23.. ఆస్తి మాత్రం రూ.250కోట్లకు పైనే
ఇతను కదా.. అసలైన ఓటరు అంటే
రెండు చేతులూ కోల్పోయినా ధైర్యం వీడలేదు..
చెత్త బండే అమ్మ ఒడి!..బిడ్డల కోసం స్టీరింగ్ పట్టిన యువతి!
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!

