పేరుకే సీరియల్ నటి.. వయసు 23.. ఆస్తి మాత్రం రూ.250కోట్లకు పైనే
జన్నత్ జుబేర్! ఈ బ్యూటీ వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే.. కానీ ఆమె ఆస్తి మాత్రం రూ. 250కోట్లకు పైగానే. స్టార్ హీరోయిన్స్ కు కూడా ఈ రేంజ్ సంపాదన లేదని బాలీవుడ్‌లో న్యూస్. మరి ఈమె ప్రొఫెషన్ ఏంటంటారా? యాక్టర్ గా సీరియల్స్‌లో చేస్తుంది. అక్కడ స్టార్ స్థానంలో ఉంది. అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సీరియల్ నటి ఆమె.
చిన్న వయసులోనే ఈ అమ్మడు తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమెను ఫాలో అయ్యే వారు మిలియన్స్ లో ఉన్నారు. ఫాలోవర్స్ లో షారుక్ ఖాన్ ను కూడా బీట్ చేసింది ఈ చిన్నది. జన్నత్ జుబేర్ కు ఇన్ స్టాలో ఏకంగా 49.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా టీవీ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ గా మారిపోయింది. బాలీవుడ్ లో ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పింది. అంతేకాదు ఈమధ్యే రాణి ముఖర్జీ హీరోయిన్‌గా నటించిన ‘హిచ్కీ’లో జన్నత్ యాక్ట్ చేసింది. సీరియల్స్ తో పాటు పలు టీవీ షోల్లోనూ నటించి ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి. ఇక జన్నత్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె ఒక్క ఫోటో షేర్ చేస్తే చాలు సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే! వైరల్ అవ్వాల్సిందే!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

