సుకుమార్ బిడ్డ యాక్టింగ్‌కు.. మహేష్ బాబు ఫిదా..
సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఇది ఆమె మొదటి సినిమా. రిలీజ్ కు ముందే ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకున్న గాంధీ తాత చెట్టు సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినీ, మీడియా ప్రముఖుల కోసం రిలీజ్‌కు ముందు రోజు అంటే జనవరి 23న స్పెషల్ ప్రీమియర్స్ వేశారు.
దీంతో పలువురు ప్రముఖులు ఈ సినిమాను చూసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు గాంధీ తాత చెట్టు సినిమాను వీక్షించాడు. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. గాంధీ తాత చెట్టు సినిమా ఎప్పటికీ మనతో ఉండిపోతుంది. అహింస గురించి అద్భుతమైన కథను అందంగా చూపించారు. సుకృతి వేణి యాక్టింగ్ చూస్తే గర్వంగా అనిపించింది. అందరూ ఈ చిత్రాన్ని తప్పకుండా వీక్షించండి మహేశ్ బాబు ఈ గురించి రాసుకొచ్చాడు. గాంధీ తాత చెట్టు సినిమాకు పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. సుకుమార్ భార్య తబితా, నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. భాను ప్రకాష్, ఆనంద చక్రపాణి, రాగ్ మయూర్, రఘురామ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. కాగా విడుదలైన ప్రతి చోటా గాంధీ తాత చెట్టు సినిమాకు మంచి స్పందన వస్తోంది. అలాగే సుకుమార్ కూతురి నటనపై కూడా ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వారి తల్లిదండ్రులందరూ గాంధీ తాత చెట్టు సినిమా చూడాలని రివ్యూయర్లు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దిమ్మతిరిగే అప్డేట్.. కన్నప్పలో ప్రభాస్‌కు ఇంట్రో సాంగ్
పేరుకే సీరియల్ నటి.. వయసు 23.. ఆస్తి మాత్రం రూ.250కోట్లకు పైనే

కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??

భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్

పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!

నాలుక కోసి శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్

నాలుక కోసి.. శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..
