దిమ్మతిరిగే అప్డేట్.. కన్నప్పలో ప్రభాస్‌కు ఇంట్రో సాంగ్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఈ మూవీకి సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడన్న వార్త బయటకు రావడంతో డార్లింగ్ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడని అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ ఆతర్వాత శివుడు పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని అనౌన్స్ చేశారు. తాజాగా పరమ శివుడుగా నటిస్తున్నాడని ప్రకటించారు. అలాగే అక్షయ్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. మరి.. ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారా అని ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేంటంటే.. కన్నప్ప సినిమాలో ప్రభాస్ కు ఇంట్రో సాంగ్ ఉంటుందట. ఈ విషయాన్నీ తాజాగా ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది లీక్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో హైపర్ ఆది గణేష్ మాస్టర్ గురించి చెప్తూ..ఈ విషయం చెప్పాడు. కన్నప్పలో ప్రభాస్ ఇంట్రో సాంగ్ ఉంటుందని.. ఆ సాంగ్ కంపోజ్ చేసింది గణేష్ మాస్టర్ అని హైపర్ అది హింట్ ఇచ్చాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ప్రభాస్ ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేరుకే సీరియల్ నటి.. వయసు 23.. ఆస్తి మాత్రం రూ.250కోట్లకు పైనే
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

