AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది ఇల్లు కాదు.. ఔషధ వనం.. అణువణువూ ఆయుర్వేదమే

ఇది ఇల్లు కాదు.. ఔషధ వనం.. అణువణువూ ఆయుర్వేదమే

Phani CH
|

Updated on: Jan 26, 2025 | 8:09 PM

Share

మీకేమిష్టం అని ఎవరైనా అడిగితే..పుస్తకాలు అని కొందరు..మొక్కలు అని ఇంకొందరు. లేదా పెంపుడు జంతువులు అని మరి కొందరు. ఇలా తమ అభిరుచికి తగ్గట్టుగా సమాధానం చెబుతారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే...అభిరుచిని కొనసాగిస్తుంటారు. అయితే..ఎవరికైనా ఈ టేస్ట్ అనేది ఏదో ఒకదానిపై ఉంటుంది. కానీ...కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పెద్దింటి రామం మాత్రం అలా కాదు.

ఆయన టేస్ట్ చాలా విభిన్నం. ఆయన అభిరుచి కేవలం ఒక్కదానితో ఆగిపోలేదు. పుస్తకాలంటే మహా ఇష్టం. అందుకే ఎన్నో విలువైన గ్రంథాలను సేకరించి ఇంట్లో దాచి పెట్టుకున్నారు. మొక్కలంటే మరింత ఇష్టం. వాటిని కూడా ఇంటి నిండా నింపేశారు. ఈ రెండే కాదు. ఆధ్యాత్మిక వస్తువులు, తాళపత్ర గ్రంథాలు..ఔషధ మొక్కలు. ఇలా ఒక్కటేంటి. ఎన్నో రకాల అరుదైన వస్తువులు ఆయన ఇంట్లో కనిపిస్తాయి. ఒక్కసారి ఆయన ఇంట్లోకి వెళ్తే ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. చుట్టూ ఎన్నో మొక్కలు మనల్ని పలకరిస్తాయి. కాస్త లోపలికి వెళ్తే మరెన్నో పుస్తకాలు ఎదురుపడతాయి. అలా వాటితోనే జీవనం సాగిస్తున్నారు ఈ పెద్దింటి రామం. ఈయన వృత్తిరీత్యా పురోహితులు. మరో ప్రత్యేకత ఏంటంటే…పెద్దింటి రామం వద్ద దాదాపు 115 సంవత్సరాల పంచాంగాలున్నాయి. 1910 నుంచి 2025 వరకూ ఉన్న పంచాగాలను సేకరించారు. ఇలా చేయడం ఆయనకు ఎంతో ఇష్టమట. అంతే కాదు. ఆయుర్వేదంపైనా అభిరుచి ఉంది. అందుకే… ఆయుర్వేద గుణాలుండి..కనుమరుగవుతున్న ఔషధ మొక్కలను పెంచుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Darshan: బెయిల్ విషయంలో మళ్లీ టెన్షన్.. టెన్షన్

డ్రామాలు ఆడుతున్నారా ?? అందర్నీ బకరాలు చేశారా ??

రజాకార్ సినిమాపై కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశంసలు

పదేళ్ల కష్టం ఆ అవార్డుకు సరిపోలేదా! పాపం పృథ్విరాజ్!‌

Samantha: వచ్చే 6 నెలలు సంతోషంగా ఉంటా…