కుంభమేళా ‘మోనాలిసా’ సరికొత్త మేకోవర్!
ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో పూసలు అమ్ముతున్న సుందరి మోనాలిసా భోంస్లే.. అందరినీ ఆకట్టుకుంది. ఎవరీ సుందరి అంటూ దేశవ్యాప్తంగా ఆమె గురించి సోషల్ మీడియాలో వెతికినవారు ఎందరో. ప్రయాగరాజ్ లో ఆమె పూసలు, దండలు అమ్ముతుండగా, ఆమెతో మాట్లాడుతూ తీసిన వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి కూడా. కేవలం కొన్ని రోజుల్లోనే ఆమె జాతీయ స్థాయిలో ఫేమస్ అయిపోయింది. కుంభమేళాకు వెళ్లినవారు ఆమె ఎక్కడుందని తెలుసుకుని వెళ్లి సెల్ఫీలు దిగడం మొదలుపెట్టారు
పెద్ద సంఖ్యలో ఆమె వద్దకు రావడం అందరూ వెళ్లడంతో తనకు ఇబ్బందులు తప్పలేదు. పూసలు, దండలు అమ్మేపని పక్కనపడిపోయింది. దీనిని తట్టుకోలేక తండ్రి ఆమెను సొంతూరు ఇండోర్ కు పంపేశారనే వార్తలు వెలువడ్డాయి. అలాంటిది ఇప్పుడు మోనాలిసా భోంస్లే మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. ఈసారి తమ ఊరిలో ఓ మేకప్ నిపుణురాలి దగ్గర మేకప్ వేయించుకుంటున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఎక్స్’లో పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటికే మిలియన్ మందికి పైగా వీక్షించారు.
Follow Us
వైరల్ వీడియోలు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

