చిరు వ్యాపారులనూ వదలని సైబర్‌ మోసగాళ్లు.. మోగకపోతే మోసపోయినట్లే!

చిరు వ్యాపారులనూ వదలని సైబర్‌ మోసగాళ్లు.. మోగకపోతే మోసపోయినట్లే!

Phani CH

|

Updated on: Jan 26, 2025 | 8:14 PM

ఇబ్రహీంపట్నం రింగుకూడలిలోని ఓ పండ్ల దుకాణం వద్ద రూ.120తో యాపిల్‌ పండ్లు కొనుగోలు చేసిన యువకుడు అక్కడున్న స్కానర్‌తో తన మొబైల్ నుంచి నగదును పంపినట్లు దుకాణదారుడికి చూపాడు. సాయంత్రానికి పండ్ల దుకాణ యాజమాని ఫోన్‌ చూసుకోగా రూ.120 వచ్చినట్లు కనిపించలేదు. ఎంత సేపు ఆలోచించినా నగదు ఎందుకు రాలేదో అర్థంకాక అయోమయానికి గురయ్యాడు.

అలాగే కొండపల్లిలోని ఓ పచారీ దుకాణం వద్దకు వెళ్లిన ఓ యువకుడు రూ.400లకు సరుకులు కొనుగోలు చేశాడు. తన చరవాణి నుంచి అక్కడ ఉన్న స్కానర్‌కు ఆ నగదును పంపినట్లు తన ఫోన్‌లో దుకాణ యాజమానికి చూపాడు. ఆ సమయంలో స్కానర్‌ వాయిస్‌ నోటిఫికేషన్‌ మెషిన్‌ మోగలేదు. తర్వాత వస్తుందిలే అని వదిలేశాడు. అనుమానం వచ్చి అదే రోజు రాత్రి తిరిగి తన ఫోన్‌పే ఖాతాను చెక్‌చేసుకోగా యువకుడు పంపిన రూ.400 రాలేదు. దీంతో మోసపోయానని లబోదిబోమన్నాడు. సైబర్‌ నేరాల్లో ఒక చోట రూ.లక్షలు, మరో చోట రూ.వేలు మోసపోయారని మనం నిత్యం వింటూనే ఉంటాం..అయితే మోసగాళ్ల ఆగడాలు లక్షల్లోనే ఉన్నాయనుకుంటే పొరపాటే. చివరకు చిల్లర రూపాయిల వద్ద కూడా వీరి జిమ్మిక్కులకు అంతులేకుండా పోయింది. పండ్ల దుకాణాలు, టిఫిన్‌ కొట్లు, రద్దీ ఉండే చిల్లర దుకాణాలు ఈ మాయగాళ్లకు వేదికలయ్యాయి. కొంత మొత్తంలో కొనుగోలు చేస్తూ దుకాణదారుడు బిజీగా ఉన్న సమయంలో స్కానర్‌ ద్వారా పంపామని చెప్పి తన ఫోన్‌లో ఉంచిన నకిలీ యాప్‌ ద్వారా వాటిని చూపి అక్కడ నుంచి జారుకుంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘బిగ్ బీ’నా మ‌జాకా.. అపార్ట్‌మెంట్‌ అమ్మకంపై 168 శాతం లాభం

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కరణ

ఇది ఇల్లు కాదు.. ఔషధ వనం.. అణువణువూ ఆయుర్వేదమే

Darshan: బెయిల్ విషయంలో మళ్లీ టెన్షన్.. టెన్షన్

డ్రామాలు ఆడుతున్నారా ?? అందర్నీ బకరాలు చేశారా ??