టిక్‌టాక్ కోసం సింహం బోనులోకి వెళ్లాడు.. చివరకు..
సింహాన్ని దూరం నుంచి చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి ఓ వ్యక్తి ఏకంగా దాని బోనులోకి ప్రవేశించాడు. టిక్‌టాక్ వీడియో కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో జరిగింది. పంజాబ్ ప్రావిన్సుకు చెందిన ముహమ్మద్ అజీమ్.. లాహోర్ సమీపంలోని ఫామ్ హౌజ్‌లో పెంచుకుంటున్న సింహం వద్దకు వెళ్లాడు.
ఈ క్రమంలోనే బోనులో ఉన్న సింహంతో టిక్‌టాక్ వీడియో తీసుకోవాలనుకున్నాడు. అందుకోసం అక్కడున్న సంరక్షకుడి అనుమతి తీసుకోకుండానే బోనులోకి ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే సింహం దాడికి దిగింది. బాధితుడు గట్టిగా కేకలు వేయడంతో సిబ్బంది వచ్చి అతడిని రక్షించారు. సింహం దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాధితుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే.. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబ్ స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత ఫామ్ హౌజ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఫామ్ యజమాని బ్రీడింగ్ లైసెన్సును రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రంలోని జంతువుల వీడియోలు, ఫొటోలను టిక్‌టాక్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై ప్రదర్శించడంపై నిషేధం అమలులో ఉంది. అయినప్పటికీ ఆ వ్యక్తి నింబంధనలను ఉల్లంఘించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెలకు ₹20తో మీ సిమ్ యాక్టివ్.. ట్రాయ్ రూల్ తెలుసా ??
చిరు వ్యాపారులనూ వదలని సైబర్ మోసగాళ్లు.. మోగకపోతే మోసపోయినట్లే!
‘బిగ్ బీ’నా మజాకా.. అపార్ట్‌మెంట్ అమ్మకంపై 168 శాతం లాభం

ట్రంప్ మరో కీలక నిర్ణయం.. వైట్ హౌస్‌లో ఫెయిత్ హౌస్..!

భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసుకుని భర్త ఆత్మ*హ*త్యాయత్నం

నమ్మండి వీరు మగాళ్లే.. వీడియో

విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు! విమానం ఎక్కాక భారీ షాక్!

దూడకు జన్మనిచ్చిన గేదె..పుట్టిన దూడను చూసి యజమాని షాక్..!వీడియో

సంగీత్ వేడుకలో డ్యాన్స్ అదరగొట్టిన యువతి.. కానీ, ఒక్కసారిగా..

వాటే మ్యాజిక్..అరటి ఆకుపై గాల్లో ఎగిరిన కుర్రాడు..! వీడియో
