నెలకు ₹20తో మీ సిమ్ యాక్టివ్.. ట్రాయ్ రూల్ తెలుసా ??
మనలో చాలామంది రెండేసి సిమ్‌లు వాడుతుంటాం. టెలికాం ఛార్జీలు పెరగడంతో రెండో సిమ్‌కార్డు వాడే వారి సంఖ్య తగ్గింది. దీంతో తమ రెండో సిమ్‌కార్డులను పక్కన పడేసిన వారెందరో. అలా ఎక్కువ రోజులు సిమ్‌కార్డును వాడకుండా వదిలేస్తే.. ఆ కార్డు మీ పేరున రద్దయి వేరొకరికి చేరుతుంది. అలా కాకుండా అది మీ పేరు మీదే కొనసాగాలీ అనుకుంటే.. కేవలం రూ.20 రీఛార్జి చేసుకుంటే సరిపోతుంది.
ట్రాయ్ తీసుకొచ్చిన ఈ నిబంధన.. ఎంతోమంది డ్యూయల్ సిమ్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. సిమ్‌కార్డును కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, డేటా వాడకుండా.. ఎటువంటి యాక్టివ్ రీఛార్జి ప్లాన్ లేకుండా.. 90 రోజులకు మించి సిమ్ కార్డును పక్కన పడేస్తే అది డిస్‌కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు మీ టెలికాం ఆపరేటర్ ఆ సిమ్‌కార్డును మీ పేరు నుంచి డీ-రిజిస్టర్ చేసి వేరొకరికి కేటయిస్తారు. ఇలా మీ పేరుమీదే సిమ్‌కార్డు కొనసాగాలంటే రూ.20 రీఛార్జి చేసుకుంటే సరిపోతుంది. మీరు 90 రోజుల పాటు మీ సిమ్‌కార్డును వాడకపోతే.. మీ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ నుంచి రూ.20 కట్ అయ్యి మీకు 30 రోజుల గడువు లభిస్తుంది. ఇలా ప్రతి నెలా రూ.20తో రీఛార్జి చేసుకుంటే మీ సిమ్‌కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరు వ్యాపారులనూ వదలని సైబర్ మోసగాళ్లు.. మోగకపోతే మోసపోయినట్లే!
‘బిగ్ బీ’నా మజాకా.. అపార్ట్‌మెంట్ అమ్మకంపై 168 శాతం లాభం
ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కరణ
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

