జియో, ఎయిర్‌టెల్ వాయిస్ ఓన్లీ ప్లాన్స్‌ చూశారా!వీడియో

జియో, ఎయిర్‌టెల్ వాయిస్ ఓన్లీ ప్లాన్స్‌ చూశారా!వీడియో

Samatha J

|

Updated on: Jan 27, 2025 | 8:20 AM

జియో, ఎయిర్‌టెల్ త‌మ వినియోగ‌దారుల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువ‌చ్చాయి. వాయిస్‌ లతో పాటు ఎస్సెమ్మెస్‌ల కోస‌మే ప్రత్యేకంగా వీటిని తీసుకురావ‌డం జ‌రిగింది. దీంతో ఇప్పుడు వినియోగదారులు తమకు అవసరం లేనప్పుడు డేటా కోసం అద‌నంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పెద్ద సంఖ్యలో యూజ‌ర్ల‌కు ప్రయోజనం కలిగిస్తుందని విశ్లేష‌కులు చెబుతున్నారు. ట్రాయ్‌ ఆదేశాలను అనుసరించి జియో, ఎయిర్‌టెల్ ఈ వాయిస్ ఓన్లీ ప్లాన్‌లను ప్రారంభించాయి.

కాలింగ్, ఎస్సెమ్మెస్‌ ప్రయోజనాలను మాత్రమే అందించే ఈ ప్లాన్‌లు ఇప్పుడు రెండు కంపెనీల వెబ్‌సైట్‌లో యూజ‌ర్లకు అందుబాటులో ఉన్నాయి. వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకురావాలని ట్రాయ్‌ 2024 డిసెంబర్ 23న అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. డేటా అవసరం లేని వారికి ఇలాంటి ప్లాన్‌లు ఉప‌యోగ‌కరంగా ఉంటాయ‌ని పేర్కొంది. ఫీచర్ ఫోన్ వినియోగదారులతో పాటు రెండు సిమ్‌లను ఉపయోగించే వారికి కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపింది. ట్రాయ్‌ ఆదేశాలను అనుసరించి జియో వాయిస్ ఓన్లీ పేరిట రెండు రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువ‌చ్చింది. రూ. 458, రూ. 1,958 ప్లాన్‌ను ప్రారంభించింది. రూ.458 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. దీనిలో దేశీయంగా ఉచిత అపరిమిత కాలింగ్‌తో పాటు 1,000 ఉచిత ఎస్సెమ్మెస్‌లను పొంద‌వ‌చ్చు. అలాగే జియో సినిమా, జియో టీవీ యాప్‌లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. ఇందులో మొబైల్ డేటా ఉండ‌దు.