Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కరణ

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కరణ

Phani CH

|

Updated on: Jan 26, 2025 | 8:10 PM

ఆకాశంలో జరిగే అద్భుతాలను ఆసక్తిగా చూసేవారికి గొప్ప శుభవార్త. అంతరిక్ష ప్రేమికులను మంత్రముగ్ధులను చేసేందుకు.. ఆకాశంలో ఖగోళ అద్భుతం జరగబోతోంది. ఆరు గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి. ఇది జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని ‘పరేడ్ ఆఫ్ ప్లానెట్స్’ అంటే... ‘గ్రహాల కవాతు’గా పిలుస్తున్నారు.

శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్, యూరేనస్, ఒకే వరుసలో కనబడతాయి. యురేనస్, నెప్ట్యూన్‌లను చూడాలంటే టెలిస్కోప్ తప్పనిసరి. ఈ గ్రహాలన్నీ ఒకే వరుస క్రమంలో వచ్చి కూర్చుంటాయి. అంటే ఆ సమయంలో ఈ గ్రహాల అమరిక సూర్యుడికి ఒకవైపున జరుగుతుంది. ఈ ఖగోళ అద్భుతం ఈ ఏడాది రెండు సార్లు కనువిందు చేయనుంది. జనవరి 21వ తేదీ, తిరిగి ఫిబ్రవరి 2వ తేదీన ఈ గ్రహాలు ఒకేవరుసలో దర్శనమివ్వనున్నట్టు పరిశోధకులు చెప్పారు. ఈ గ్రహాల కవాతు మన దేశంలో కూడా కనిపిస్తుంది. ఈ గ్రహాల పరేడ్ దాదాపు నాలుగు వారాలు ఆకాశంలో ఉంటుంది. ఈ గ్రహాలు సూర్యాస్తమయాన, సాయంత్రం 8:30 గంటల సమయంలో ఆకాశంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే, ఈ దృశ్యాల స్పష్టత వాతావరణ పరిస్థితులు, కాలుష్య స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. ఆరు నుంచి ఏడు గ్రహాలు ఒకే వరుసలో ఉండడం చాలా అరుదుగా జరిగే సంఘటన. అలాంటి అరుదైన ఘట్టం.. పరేడ్ ఆఫ్ ప్లానెట్స్ చూసే అవకాశాన్ని మిస్‌ చేసుకోవద్దంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది ఇల్లు కాదు.. ఔషధ వనం.. అణువణువూ ఆయుర్వేదమే

Darshan: బెయిల్ విషయంలో మళ్లీ టెన్షన్.. టెన్షన్

డ్రామాలు ఆడుతున్నారా ?? అందర్నీ బకరాలు చేశారా ??

రజాకార్ సినిమాపై కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశంసలు

పదేళ్ల కష్టం ఆ అవార్డుకు సరిపోలేదా! పాపం పృథ్విరాజ్!‌