Araku: గుడ్ న్యూస్.. అరకు లోయలో పారాగ్లైడింగ్

Araku: గుడ్ న్యూస్.. అరకు లోయలో పారాగ్లైడింగ్

Phani CH

|

Updated on: Jan 26, 2025 | 8:35 PM

మన్యంలో ప్రకృతి పరవశిస్తోంది. అరకు అందాలు కనువిందు చేస్తున్నాయి. వెండిమబ్బులు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది అక్కడి ఆహ్లాదకర వాతావరణం. అందమైన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. అరకు లోయతో పాటు లంబసింగి, వంజంగిలోని ఈ మేఘాల కొండలు మైమరిపిస్తున్నాయి. ఆకాశమే దిగివచ్చిందా అన్నట్లు ఈ అద్భుత దృశ్యాలు ఔరా అనిపిస్తున్నాయి.

అరకులో ఉన్నామా… ఆకాశంలో విహరిస్తున్నామా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. మన అరకువ్యాలీ ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ అయింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అరకులో పారాగ్లైడింగ్‌ అవకాశాన్ని కల్పించబోతోంది. ఇప్పటికే అందాల అరకులోయ అద్భుతసోయగాలతో పర్యాటకులను ఫిదా చేస్తోంది. ప్రకృతి వరప్రసాదం అరకువ్యాలీకి అదనపు హంగులు అద్దుతోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. అరకు లోయలో ఇక పారాగ్లైడింగ్ అందుబాటులోకి రాబోతోంది. ట్రయల్‌ రన్ సక్సెస్‌ అయింది. మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ దగ్గర ట్రయల్‌ రన్‌ నిర్వహించారు కోచ్ విజయ్‌. హిమాచల్‌కు చెందిన పైలెట్లు పారాగ్లైడింగ్‌ చేశారు. నెలాఖరు నుంచి అందుబాటులో తెచ్చేలా ప్రణాళికలు చేస్తున్నారు. అరకు ప్రాంతంలో గాలివాటాన్ని అంచనా వేసి.. వాతావరణ పరిస్థితులు ఎంత వరకూ అనుకులిస్తాయనే దానిపై ఓ అంచనాకు వచ్చాక ట్రయల్‌ రన్‌ చేశారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంపై కోచ్, పైలట్లు హర్షం వ్యక్తం చేశారు. అరకులోయ.. పారాగ్లైడింగ్‌ కు ఎంతో అనుకూలంగా ఉందన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏనుగులు పగబట్టాయా ?? ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం చేసిన గజరాజు

టిక్‌టాక్‌ కోసం సింహం బోనులోకి వెళ్లాడు.. చివరకు..

నెలకు ₹20తో మీ సిమ్‌ యాక్టివ్‌.. ట్రాయ్‌ రూల్‌ తెలుసా ??

చిరు వ్యాపారులనూ వదలని సైబర్‌ మోసగాళ్లు.. మోగకపోతే మోసపోయినట్లే!

‘బిగ్ బీ’నా మ‌జాకా.. అపార్ట్‌మెంట్‌ అమ్మకంపై 168 శాతం లాభం