బాబాయ్‌కి పద్మభూషణ్‌పై అబ్బాయిల రియాక్షన్
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్దును ప్రకటించింది. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను బాలయ్యను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ప్రత్యేకించి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా చెప్పిన విషెస్ వైరల్ అవుతున్నాయి.
పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణ బాబాయ్‌కి హృదయపూర్వక అభినందనలు. ఈ గుర్తింపు మీరు సినిమాకు చేసిన అసమానమైన కృషికి, మీ అవిశ్రాంత ప్రజా సేవకు నిదర్శనం. అంటూ ఎన్టీఆర్ పోస్ట్ పెట్టాడు. ఇక ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన మా బాలకృష్ణ బాబాయ్‌కి హృదయపూర్వక అభినందనలు. మీరు సమాజానికి చేసిన కృషికి ఇది నిజమైన గుర్తింపు బాబాయ్ అంటూ కళ్యాణ్ రామ్ తన పోస్ట్ ద్వారా విషెస్ చెప్పాడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కాలంలో బాలకృష్ణకి, ఎన్టీఆర్‌కి పడటం లేదనే రూమర్లు వినిపించాయి. తారక్‌ని బాలయ్య దూరం పెట్టారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బాబాయ్‌కి ఎన్టీఆర్ విషెస్ చెప్పడం ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తుంది. బాబాయ్‌కి ఇద్దరు అబ్బాయిలు వెంట వెంటనే విషెస్ చెప్పడం నందమూరి అభిమానుల్లో ఆనందం కలిగిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అసలేంటీ డ్రోన్ సిటీ ?? సీఎం చంద్రబాబు లక్ష్యం ఇదేనా
7 నెలల కిందట పెళ్లి.. భార్య గర్భవతి.. ఇంతలోనే సూసైడ్ లెటర్.. అసలేమైంది ??
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి వింత శబ్దాలు.. దగ్గరికెళ్లి చూసిన స్థానికులకు షాక్ !!
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

