Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. సంతలో అద్దెకు యువతులు, మహిళలు!

దారుణం.. సంతలో అద్దెకు యువతులు, మహిళలు!

Phani CH

|

Updated on: Jan 27, 2025 | 6:13 PM

మన దేశంలోని పలు రాష్ట్రాల్లో మహిళలు అద్దెకు దొరుకుతారన్న విషయం మీకు తెలుసా? మనకు నచ్చిన వారిని కొంతకాలానికి అద్దెకు తీసుకోవచ్చు. ఆపై వారిని తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారమంతా చాలా పకడ్బందీగా జరుగుతుంది. స్టాంప్ పేపర్లపై అగ్రిమెంట్ వంటి తతంగం కూడా ఉంటుంది. ఇందుకోసం ప్రత్యక్షంగా సంత నిర్వహించడం మరో విశేషం.

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ధడీచా పేరుతో ఈ సంత నిర్వహిస్తారు. ప్రతి ఏడాది నిర్ణీత సమయంలో జరిగే ఈ సంతలో యువతులు, మహిళలను అద్దెకు తీసుకోవచ్చు. ఈ సంతకు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. నచ్చిన అమ్మాయిని నెలలు, సంవత్సరాల చొప్పున అద్దెకు తీసుకుంటారు. ఇక్కడికి వచ్చేవారు రూ. 15 వేలతో మొదలుపెట్టి లక్షల అద్దె చెల్లించేందుకు సిద్ధపడతారు. కన్యలకు మరింత ఎక్కువ ధర పలుకుతుంది. అయితే, ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించే హక్కు ఆ మహిళలకు ఉంటుంది. అద్దెకు వెళ్లిన ఇంట్లో తనకు ఇబ్బందులు ఎదురైనా, అసౌకర్యంగా అనిపించినా, ఇంకే కారణంతోనైనా ఆమె తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. ఒప్పందంలో ఈ విషయాన్ని స్పష్టంగా రాస్తారు. పెళ్లికి తగిన యువతి దొరకని వారు, ఇంట్లోని వయోవృద్ధుల సంరక్షణ కోసం కూడా మహిళలను ఇలా అద్దెకు తీసుకుంటారు. ఇలాంటి ఆచారమే రాజస్థాన్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లోని కొన్ని సామాజిక వర్గాల్లో ఉంది. రాజస్థాన్‌లో దీనిని ‘నటప్రత’ అని పిలుస్తారు. ‘నటప్రత’పై ఇటీవల తరచూ మీడియాలో వార్తలు వస్తుండటంతో జాతీయ మానవహక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇదెక్కడి ఆచారమంటూ విస్తుపోయింది. దీనిని అరికట్టే చర్యలు చేపట్టాలంటూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖతోపాటు ఆ నాలుగు రాష్ట్రాలను కోరింది. గతంలో దీనిపై రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదులు కూడా అందాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక వారానికి నాలుగు రోజులే పని !! వచ్చేస్తోంది కొత్త లేబర్ కోడ్

కేంద్రం గుడ్‌ న్యూస్..! రూ.10 లక్షల వరకూ నో ట్యాక్స్ ?

ఉత్తరాఖండ్‌లో అమలులోకి వచ్చిన ఉమ్మడి పౌరస్మృతి

కొలంబియా యూటర్న్‌.. ట్రంప్‌ నిబంధనలకు ఓకే

కుంభమేళా చుట్టూ చిట్టడవి.. స్వచ్ఛమైన గాలికి కొదవే లేదు..