శివ శంకర్‌గా మారిన సద్దాం హుసేన్.. ప్రియురాలి కోసం హిందువుగా
పదేళ్లుగా ప్రేమించిన హిందూ మహిళను పెళ్లాడేందుకు ఒక ముస్లిం వ్యక్తి మతం మారాడు. హిందూ మతాన్ని స్వీకరించడంతోపాటు తన పేరును కూడా మార్చుకున్నాడు. హిందూ ఆచారం ప్రకారం ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నగర్ బజార్ ప్రాంతంలో నివసించే 34 ఏళ్ల సద్దాం హుస్సేన్, అదే గ్రామానికి చెందిన 30 ఏళ్ల హిందూ మహిళ పదేళ్లుగా ప్రేమలో ఉన్నారు.
వేర్వేరు మతాలకు చెందినవారు కావడంతో వారిద్దరూ పెళ్లి చేసుకోలేకపోయారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ సద్దాంను ఒత్తిడి చేసింది. అయితే ఆమెతో పెళ్లికి అతడి కుటుంబం ఒప్పుకోలేదు. కాగా, మూడు రోజుల కిందట సద్దాం హుస్సేన్, అతడి కుటుంబ సభ్యులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని, గర్భస్రావం కోసం బలవంతం చేయడంతోపాటు చంపుతామని వారు బెదిరించినట్లు ఆరోపించింది. దీంతో సద్దాం, అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో సద్దాం హుస్సేన్ హిందూమతంలోకి మారాడు. తన పేరును శివశంకర్‌గా మార్చుకున్నాడు. జనవరి 19న ఆదివారం రాత్రి స్థానిక గుడిలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆ మహిళను పెళ్లి చేసుకున్నాడు. పదేళ్లుగా ప్రేమించుకుంటున్న తాము కలిసి జీవించాలని నిర్ణయించామని, అందుకే హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నట్లు వారు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

