అసలేంటీ డ్రోన్ సిటీ ?? సీఎం చంద్రబాబు లక్ష్యం ఇదేనా
అభివృద్ధి అనే పదానికి ఎప్పటికప్పుడు డెఫినేషన్లు మారుతున్నాయ్. ఏదో ఒక్క సెక్టార్‌లో ముందుంటే సరిపోదు. ప్రతి రంగంలోనూ ఏదో ఓ కొత్తదనం చూపించాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మారిపోవాలి. తరాలు మారుతున్నా..ఎప్పటికప్పుడు కొత్త తరంతో పోటీ పడాలి. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ అడుగు ముందే ఉంటారు.
ఒకప్పుడు ఐటీ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్. ఈ రెండు టెక్నాలజీలకి ఆంధ్రప్రదేశ్‌ని హబ్‌గా మార్చేస్తామని స్టేట్‌మెంట్ ఇచ్చారు చంద్రబాబు. ఈ మధ్యే జరిగిన దావోస్ సమ్మిట్‌లోనూ ఆయన ఆధునిక సాంకేతికతల గురించి ప్రస్తావించారు. అప్‌డేట్ అవడం ఎంత ముఖ్యమో ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. అయితే…ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరవాత ఈ హయాంలో ఆయన మరింత ఎక్కువగా టెక్నాలజీపై ఫోకస్ పెడుతున్నారు. ఎప్పుడు సందర్భం వచ్చినా యువతకు హితబోధ చేస్తున్నారు. ఈ సమయంలోనే తన కలల ప్రాజెక్ట్ గురించి చెప్పారు సీఎం చంద్రబాబు. అదే డ్రోన్ సిటీ. దావోస్‌లో జరిగిన సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు ఈ డ్రోన్ సిటీ గురించి చాలా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్ట్‌తో డ్రోన్ టెక్నాలజీతో పాటు ఏవియేషన్‌లో ఏపీ రూపు రేఖలు ఎలా మారతాయో కూడా వివరించారు. ఈ సమయంలోనే డ్రోన్స్, సీసీ కెమెరాలతో పాటు శాటిలైట్స్ గురించి మాట్లాడారు. అయితే..వీటిలో డ్రోన్స్ పని తీరు ఎలా ఉంటుంది..? అవి ఎన్ని విధాలుగా ఉపయోగపడతాయో చెప్పారు. వ్యవసాయం నుంచి మొదలు పెడితే ప్రతీ రంగంలోనూ డ్రోన్స్‌ని వినియోగించే అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావించారు చంద్రబాబు. అయితే..ముఖ్యంగా వ్యవసాయంలో చాలా రోజులుగా ఈ డ్రోన్ల వాడకం పెరుగుతోంది. పంటకు పురుగుల మందు జల్లే డ్రోన్స్ చాలానే అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే వీటి వినియోగం విరివిగా జరగడం లేదు. ఈ వాడకాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు. ఇదే సమయంలో ఈ డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ కోసం ఆయన పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
7 నెలల కిందట పెళ్లి.. భార్య గర్భవతి.. ఇంతలోనే సూసైడ్ లెటర్.. అసలేమైంది ??
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి వింత శబ్దాలు.. దగ్గరికెళ్లి చూసిన స్థానికులకు షాక్ !!
చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్..! వీటిని అస్సలు తినకూడదట!
దారుణం.. సంతలో అద్దెకు యువతులు, మహిళలు!
ఇక వారానికి నాలుగు రోజులే పని !! వచ్చేస్తోంది కొత్త లేబర్ కోడ్

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
