Hyderabad: మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు దీపావళి కానుక.. పాస్ ధరలు భారీగా తగ్గింపు..!
హైదరాబాద్‌లో ప్రతిరోజూ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించే వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సామాన్యులు, ఉద్యోగులు, విద్యార్థుల ప్రయాణ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి ట్రావెల్ పాస్‌ల ధరలను భారీగా తగ్గించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.
హైదరాబాద్‌లో ప్రతిరోజూ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించే వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సామాన్యులు, ఉద్యోగులు, విద్యార్థుల ప్రయాణ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి ట్రావెల్ పాస్‌ల ధరలను భారీగా తగ్గించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలకు దీపావళి కానుకగా మంత్రి అభివర్ణించారు. తగ్గించిన కొత్త ధరలు నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.
నెలవారీ పాస్‌పై రూ.4,500 ఆదా!
ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి నెలవారీ ట్రావెల్ పాస్ కోసం ప్రయాణికులు రూ.8,500 చెల్లించాల్సి వచ్చేది. అయితే ప్రభుత్వం ఈ ధరను ఏకంగా రూ.4,000కు తగ్గించింది. అంటే నెలకు రూ.4,500 ఆదా చేసుకోవచ్చు. ఇందులో మెట్రో ప్రయాణానికి రూ.3,000, ఆర్టీసీ బస్సు ప్రయాణానికి రూ.1,000 కేటాయించారు. ఈ పాస్‌తో నెలలో గరిష్టంగా 50 మెట్రో సింగిల్ ట్రిప్పులు చేయవచ్చు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఎలాంటి పరిమితులు ఉండవు.
రోజువారీ పాస్ ధర కూడా తగ్గింపు
రోజూ మెట్రో, బస్సుల్లో ప్రయాణించే వారికి కూడా ప్రభుత్వం ఊరటనిచ్చింది. గతంలో రూ.400గా ఉన్న ఒకరోజు ఉమ్మడి ట్రావెల్ పాస్ ధరను రూ.275కు తగ్గించింది. ఇందులో మెట్రోకు రూ.200, ఆర్టీసీకి రూ.75 కేటాయించారు. ఈ పాస్‌తో రోజుకు నాలుగు సింగిల్ జర్నీలు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఒక్కో రోజుకు రూ.125 ఆదా అవుతుంది.
ప్రయాణికులకు భారీ ఊరట!
ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావడం, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, నిత్యం హైదరాబాద్‌లో ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ఆర్థికంగా ఎంతో ఉపయోగపడనుంది.
మొత్తంగా మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం అందించిన ఈ దీపావళి కానుకతో నెలవారీ, రోజువారీ ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి. నవంబర్ 8 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానుండటంతో ప్రయాణికులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్యాసింజర్ లగేజ్ చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
హాస్టల్ గదుల్లో నాగుపాములు, తేళ్లు..విద్యార్థినులను కరిచిన ఎలుకలు
డైరెక్టర్ అవుదామనుకున్నాడు.. కట్ చేస్తే దొంగయ్యాడు!
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఇక ఓటీపీతో పని లేదు!
ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!

