Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025: బడ్జెట్‌లో ఈ పదాలకు అర్థాలు తెలుసా ??

Budget 2025: బడ్జెట్‌లో ఈ పదాలకు అర్థాలు తెలుసా ??

Phani CH

|

Updated on: Jan 28, 2025 | 4:43 PM

ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది పద్దుని ప్రవేశపెడతారు. 2024లో మరోసారి భారీ మెజార్టీతో ఎన్నికైన మోదీ సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్‌ని సిద్ధం చేసింది. గతంలో భారీ మొత్తంలో పేపర్స్‌ తీసుకొచ్చి పార్లమెంట్‌లో చదివి వినిపించే వాళ్లు. కానీ...ఆ తరవాత ఈ ప్రాసెస్‌ని డిజిటలైజ్ చేశారు నిర్మలా సీతారామన్.

ఓ ట్యాబ్‌లో బడ్జెట్ లెక్కలన్నీ పొందు పరచడం మొదలు పెట్టారు. అయితే..కేంద్ర బడ్జెట్ అంటే కేవలం లెక్కలు మాత్రమే కాదు. దీని వెనకాల ఎన్నో ఆసక్తికరమైన విషయాలుంటాయి. అవేంటో ఓ సారి చూద్దాం. భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చిన తరవాత 1947లో తొలిసారి ఆర్‌కే షణ్ముఖం చెట్టి బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు. 1948 మార్చి 31 వరకు..అంటే ఏడున్నర నెలల కాలానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్ ఇది. అప్పటి ఆర్థిక సమస్యల్ని తీర్చేందుకు ఈ పద్దుని తీసుకొచ్చారు. ఇప్పటి వరకూ ఎంతో మంది ఆర్థిక మంత్రులు ఈ బడ్జెట్‌ని ప్రవేశపెట్టే క్రమంలో ప్రసంగించారు. కానీ… సుదీర్ఘంగా స్పీచ్ ఇచ్చిన రికార్డ్ మాత్రం ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిటే ఉంది. 2020లో బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన సమయంలో 2 గంటల 42 నిముషాల పాటు ప్రసంగించారు నిర్మలా సీతారామన్. 1950లో బడ్జెట్ డాక్యుమెంట్స్‌ లీక్ అయ్యాయి. ప్రింటింగ్ చేస్తుండగా అందులోని కీలక సమాచారం లీక్ అయింది. ఇది తెలిసి వెంటనే ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్‌ని మింటో రోడ్‌లోని రాష్ట్రపతి భవన్‌కి తరలించింది. 1980 తరవాత దాన్ని పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌ బేస్‌మెంట్‌లోకి షిప్ట్ చేసింది. 1955 వరకూ కేంద్ర బడ్జెట్ కేవలం ఇంగ్లీష్‌లోనే ఉండేది. ఆ తరవాత బడ్జెట్‌ని ఇంగ్లీష్‌తో పాటు హిందీలోనూ ప్రవేశపెట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Budget 2025: బడ్జెట్ నుంచి మిడిల్ క్లాస్ ఏం కోరుకుంటోంది ??

Saif Ali Khan: సైఫ్‌ పై దాడి సమయంలో కరీనా కపూర్ పార్టీలో ఉన్నారా ?? మనుషుల తీరుపై హీరోయిన్ సీరియస్

వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ గుట్టురట్టు

బాబాయ్‌కి పద్మభూషణ్‌పై అబ్బాయిల రియాక్షన్‌

అసలేంటీ డ్రోన్ సిటీ ?? సీఎం చంద్రబాబు లక్ష్యం ఇదేనా