పానీపూరి తింటున్నారా ?? అసలు విషయం తెలిస్తే దాని జోలికే పోరు
సాయంత్రం కాగానే అలా వీధిలోకి వెళ్లి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనో, రోడ్డు పక్కన అమ్మే బండిపైనో రకరకాల స్నాక్స్ తింటుంటారు. వీటిలో పానీ పూరీ అంటే చాలామంది ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటారు. యువతరంతో పాటు పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడి తినే చిరుతిండి... పల్లెల్లో పట్టణాల్లో వీధి చివర్లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పానీపూరి అమ్మకాలు ఊపందుకున్నాయి.
అయితే కస్ట్‌మర్స్‌ను ఆకర్షించేందుకు ఈ వ్యాపారులు అందులో ఏం కలుపుతున్నారో తెలుసా! తెలిస్తే ఇక జీవితంలో వాటి జోలికి వెళ్లరు. పక్కనున్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నిషేధం విధించే వరకు వెళ్లిన ఆ వ్యవహారం మన వద్ద ముదిరి పాకాన పడుతున్నా పట్టించుకోకపోవడం లేదన్న వాదనుంది. ఇంతకీ పానీపూరితో వచ్చే ముప్పేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పానీ పూరి, గోబీ మంచూరియా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, చికెన్ కబాబ్… తరచూ ఇలాంటి ఫాస్ట్‌ఫుడ్స్ తింటున్నారా? అయితే మీరు జాగ్రత్తపడక తప్పదు. జిహ్వకు రుచి కలిగించే ఈ పదార్థాలు మీ ఆరోగ్యాన్ని హరిస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడులోని ముఖ్య పట్టణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలోని తినుబండారాల నమూనాలను సేకరించి వాటిని ప్రయోగశాలల్లో పరీక్షించగా, వాటిలో క్యాన్సర్లు కలిగించే రసాయనాలు అధికమోతాదులో ఉన్నట్టు గుర్తించారు. దీనివల్ల మహిళల్లో పునరుత్పాదకత శక్తి తగ్గుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి తినుబండారాల అమ్మకాలపై కర్ణాటకలో ఆంక్షలు విధించారు. జిల్లాలో కూడా వీటి విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏడాదిన్నరగా పోలీసులకు చిక్కని స్మగ్లర్.. కుంభమేళాలో బుక్కయ్యాడు.. ఎలా అంటే..
Saif Ali Khan: సైఫ్’ కేసులో అరెస్టుతో.. నా జీవితం నాశనం !!
Manchu Lakshmi: వాళ్లు చాలా దురుసుగా ప్రవర్తించారు మంచు లక్ష్మి పోస్టులు వైరల్
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

