ఆరు నెలల కిందట ప్రేమ వివాహం.. ఇప్పుడు కట్టమీద శవమైన యువకుడు
పరువు హత్యా లేక పాతకక్షలా..!! సూర్యాపేటలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఆరు నెలల కింద ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో మూసీ కెనాల్ కట్టపై చోటు చేసుకుంది. మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ.. ఆరు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు.
ఆ తరువాతే షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి కృష్ణకు ఓ వ్యక్తి ఫోన్ చేసి బయటకు రావాలని చెప్పాడు. దీంతో అతను ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. పిల్లలమర్రికి వెళ్లే మూసీ కెనాల్ కట్టపై శవమై తేలాడు. సమాచారం అందుకున్న భార్య, కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి వెళ్లారు. కృష్ణ మృతదేహాన్ని చూసి భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాళ్లగడ్డకు చెందిన మహేశ్ అనే వ్యక్తి ఫోన్ చేయడంతో తన భర్త బయటకు వెళ్లినట్లు మృతుడి భార్య తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పానీపూరి తింటున్నారా ?? అసలు విషయం తెలిస్తే దాని జోలికే పోరు
ఏడాదిన్నరగా పోలీసులకు చిక్కని స్మగ్లర్.. కుంభమేళాలో బుక్కయ్యాడు.. ఎలా అంటే..
Saif Ali Khan: సైఫ్’ కేసులో అరెస్టుతో.. నా జీవితం నాశనం !!
Manchu Lakshmi: వాళ్లు చాలా దురుసుగా ప్రవర్తించారు మంచు లక్ష్మి పోస్టులు వైరల్
Budget 2025: బడ్జెట్‌లో ఈ పదాలకు అర్థాలు తెలుసా ??

మోటారు లేకుండానే ఉబికి వస్తున్న గంగ

కారును రైల్వే ప్లాట్ఫామ్పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??

భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్

పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!

నాలుక కోసి శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్
