AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shankar: నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కన్‌ఫ్యూజన్‌.. శంకర్ ఏం చేయబోతున్నారు ..?

Shankar: నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కన్‌ఫ్యూజన్‌.. శంకర్ ఏం చేయబోతున్నారు ..?

Phani CH
|

Updated on: Mar 11, 2026 | 1:29 PM

Share

ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా వెలుగొందిన శంకర్ ప్రస్తుతం వరుస అపజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ చిత్రాల ప్రభావంతో ఆయన తదుపరి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. నిర్మాణ సంస్థలతో బడ్జెట్ వివాదాలు, గడువుల కారణంగా శంకర్ భవిష్యత్ చిత్రాలపై గందరగోళం నెలకొంది. స్పష్టత కోసం వేచి చూడాలి.

ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని పాలించిన శంకర్ ప్రస్తుతం కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. వరుస ఫెయిల్యూర్స్‌తో ఆయన ఇమేజ్ దెబ్బతింది. భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కనీస వసూళ్లను కూడా సాధించలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో శంకర్ తదుపరి సినిమా ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడ్డాయి. శంకర్ గతంలో ప్రకటించిన వేల్పరి నవల ఆధారిత సినిమా పట్టాలెక్కించడం కష్టంగా మారింది. నిర్మాణ సంస్థలు భారతీయుడు 3 పనులు పూర్తి చేస్తే తప్ప మరో ప్రాజెక్టు ప్రారంభించడానికి అంగీకరించడం లేదు. బడ్జెట్ విషయంలో దర్శకుడు శంకర్, నిర్మాతల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శంకర్ భారతీయుడు 3 నిర్మాతలకు మూడు నెలల గడువు విధించారు. ఈ డెడ్‌లైన్ లోగా నిర్ణయం తీసుకోకపోతే తాను మరో ప్రాజెక్టును మొదలుపెడతానని తెలిపారు. అయితే, ఈ పరిస్థితుల్లో శంకర్ అంత ధైర్యం చేయగలరా, వందల కోట్లు ఖర్చు పెట్టే నిర్మాత దొరుకుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ గందరగోళం ఎప్పుడు వీడుతుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay-Rashmika: బ్యాక్‌ టు షూట్‌.. షాకిస్తున్న విరోష్‌ జంట

గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?

ఆ జిల్లాల పరివాహకంలో ఏడాదిపాటు శుభకార్యాలు బంద్

Jr NTR: అప్పట్లో మా తాత.. ఇప్పుడు నేను.. చాలా సంతోషంగా ఉంది

ట్రంప్‌.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల

Follow Us