Jani Master: ‘అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తు కొచ్చారు’.. జానీ మాస్టర్ కామెంట్స్ వైరల్

ఓ లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో జైలుకి వెళ్లొచ్చారు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. సుమారు నెల రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన బెయిల్ పై బయటకి వచ్చారు. గతంలోలాగే మళ్లీ సినిమా పనుల్లో బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు.

Jani Master: 'అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తు కొచ్చారు'.. జానీ మాస్టర్ కామెంట్స్ వైరల్
Jani Master, Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Jan 02, 2025 | 7:14 PM

జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ మొదట కొన్ని రోజులు ఎవ్వరికీ కనిపించలేదు. ఎక్కువగా ఇంటికే పరిమితమైపోయాడు. భార్య, పిల్లలతోనే సమయం గడిపాడు. ఆ తర్వాత సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లకు హాజరయ్యాడు. ఇప్పుడు మళ్లీ కొరియోగ్రాఫర్ గా అవకాశాలు అందుకుంటున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ధోప్ సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. కాగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి జానీ మాస్టర్ ఇక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో అతని భార్య కూడా పాల్గొంది. ఈ సందర్భంగా తన జైలు జీవితం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడీ స్టార్ కొరియోగ్రాఫర్. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నాగబాబు, అల్లు అర్జున్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నారు.

‘ అల్లు అర్జున్ తర్వాత జానీ మాస్టర్ హ్యాపీగా ఉన్నాడంటూ కొన్ని మీమ్స్ చూశాను. నిజం చెప్పాలంటే అసలు పగవాడికి, శత్రువుకి కూడా జైలు జీవితాన్ని చూసే పరిస్థితి రాకూడదు. అల్లు అర్జున్ అరెస్ట్ వార్త విన్న తరువాత వెంటనే నాకు బన్నీ పిల్లలు గుర్తుకు వచ్చారు. ఆ పిల్లల పరిస్థితి ఏంటో అని ఆలోచించాను. ఎందుకంటే జైల్లో జీవితం నరకప్రాయమే. ఎంతటి పెద్దవారైనా సరే నేల మీదే పడుకోవాల్సి ఉంటుంది. ప్రతీ రోజూ సాయంత్రం అయితే ఇంటికి వెళ్లి.. పిల్లలతో గడపడం, వాకి ముచ్చట్లు వింటూ ఉండే వాన్ని. కానీ జైల్లో అలా ఒంటరిగా ఉండటం భరించలేకపోయాను. భార్య, పిల్లలు, అమ్మ గుర్తుకు వచ్చారు. అమ్మకి అసలే ఆరోగ్యం బాగా లేదని, హార్ట్ కొంచెం వీక్‌గా ఉందని, ఇలాంటి విషయాలు తెలిస్తే ఇంకేం అవుతుందో అని టెన్షన్ పడ్డాను. ఇక ఇవన్నీ తల్చుకుని అందరి ముందు ఏడ్వకుండా.. అక్కడి బాత్రూంలోకి వెళ్లి భోరున ఏడ్చేశాను’ అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

డ్యాన్స్ ప్రాక్టీస్ లో జానీ మాస్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..