- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Fame Shobha Shetty And Tasty Teja Visit Tirumala Srivari Temple, See Photos
Shobha Shetty: తిరుమల శ్రీవారి సన్నిధిలో బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టి.. టేస్టీ తేజతో కలిసి దేవుని దర్శనం.. ఫొటోస్ ఇదిగో
బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ తో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైపోయింది కన్నడ బ్యూటీ శోభా శెట్టి. అంతకు ముందు కార్తీక దీపం సీరియల్ లో మోనిత పాత్రలో బుల్లితెర ఆడియెన్స్‌నూ అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
Updated on: Jan 01, 2025 | 8:20 PM

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ కంటెస్టెంట్ శోభా శెట్టి అలియాస్ మోనిత తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. బుధవారం (జనవరి 01)న ఆమె ఏడుకొండస్వామి వారి సేవలో పాల్గొంది.

శోభా శెట్టితో పాటు మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజా కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. దర్శనానంతరం గుడి నుంచి బయటకు వచ్చిన వీరితో ఫొటోలు దిగేందుకు భక్తుల పోటీ పడ్డారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు శోభా శెట్టి, టేస్టీ తేజా. దీంతో ఇది నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో భా శెట్టి కూడా ఒకరు. ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన శోభ తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ముఖ్యంగా శివాజీ గ్యాంగ్ తో ఢీ అంటే ఢీ అంటూ తలపడింది. అయితే ఫైనల్ వరకు వెళ్లలేకపోయిందీ అందాల తార. ప్రస్తుతం పలు టీవీషోల్లో సందడి చేస్తోంది శోభ.





























