Game Changer: ఎట్టకేలకు అప్పన్న ఆగమనం.. గేమ్ ఛేంజర్ ట్రైలర్ పైనే అంచనాలు..
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. మ్యాజిక్ ఫిల్మ్ మేకర్ శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. జనవరి 10న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా.. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే న్యూఇయర్ వేళ మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్.