- Telugu News Photo Gallery Cinema photos Sankranti 2025 movies daku maharaj, game changer, sankranthiki vasthunnam promotion details
కలిసుందాం రా.. అంటున్న సంక్రాంతి హీరోలు..
కలిసుంటే కలదు సుఖం అంటారు కదా..! ఇప్పుడు మన హీరోలు కూడా ఇదే చేస్తున్నారు. సంక్రాంతికి పోటీ పడుతున్నా.. బయట మాత్రం అంతా ఒక్కటే అంటున్నారు. కలిసి కట్టుగా సినిమాలు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఒకరి కోసం ఒకరు అన్నట్లు అంతా కలిసి ముందుకు వెళ్తున్నారు. మరి మనోళ్ల కలిసుందాం రా సినిమా ఓసారి చూద్దామా..? చూస్తుండగానే సంక్రాంతి సమీపిస్తుంది.. అందుకే ప్రమోషన్స్‌లోనూ జోరు పెంచేసారు మన హీరోలు.
Updated on: Jan 01, 2025 | 3:33 PM

కలిసుంటే కలదు సుఖం అంటారు కదా..! ఇప్పుడు మన హీరోలు కూడా ఇదే చేస్తున్నారు. సంక్రాంతికి పోటీ పడుతున్నా.. బయట మాత్రం అంతా ఒక్కటే అంటున్నారు. కలిసి కట్టుగా సినిమాలు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఒకరి కోసం ఒకరు అన్నట్లు అంతా కలిసి ముందుకు వెళ్తున్నారు. మరి మనోళ్ల కలిసుందాం రా సినిమా ఓసారి చూద్దామా..?

చూస్తుండగానే సంక్రాంతి సమీపిస్తుంది.. అందుకే ప్రమోషన్స్‌లోనూ జోరు పెంచేసారు మన హీరోలు. అందులో అందరికంటే ముందొస్తున్నారు రామ్ చరణ్.

జనవరి 10న విడుదల కానుంది గేమ్ ఛేంజర్. జనవరి 12న డాకూ మహరాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదల కానున్నాయి. ఈ మూడు సినిమాలకు వారధిగా మారుతున్నారు బాలకృష్ణ.

బాలయ్య ప్రస్తుతం సినిమాలతో పాటు అన్‌స్టాపబుల్ షో కూడా చేస్తున్నారు. ఆహాలో వస్తున్న ఈ షోకు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ షోకు సంక్రాంతి హీరోలను గెస్టులుగా తీసుకొస్తున్నారు బాలయ్య. ఇప్పటికే వెంకటేష్ వచ్చిన ఎపిసోడ్ బాగా పేలింది. సినిమా ప్రమోషన్‌తో పాటు.. పర్సనల్ విషయాలను బాగానే పంచుకున్నారు వెంకీ.

అన్‌స్టాపబుల్‌లో సొంత సినిమా ప్రమోషన్ కూడా చేసుకుంటున్నారు బాలయ్య. డాకూ మహరాజ్ టీం ఈ షోకు వచ్చారు.. అలాగే రామ్ చరణ్ ఈ టాక్ షోకు వస్తున్నారు. హీరో ఒక్కడే కాదు.. గేమ్ ఛేంజర్ టీం అంతా ఈ షోకు రానున్నారు. మొత్తానికి బాలయ్య తన డాకూ మహరాజ్‌తో పాటు.. మిగిలిన రెండు సినిమాలను కూడా తన షోలో ప్రమోట్ చేస్తున్నారు.




