- Telugu News Photo Gallery Cinema photos Heroine Deepika Padukone ready to act in special Amrita role in brahmastra movie in bollywood
Deepika Padukone: నిను వీడని నీడను నేను.. పాటను ప్రాక్టీస్ చేస్తున్న దీపిక పదుకోన్.!
నిను వీడని నీడను నేను.. అనే పాటను బాగానే ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు దీపిక పదుకోన్. ఇప్పుడు ఆ పాటను ఎందుకు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది? ఏ మూవీలోనైనా రీమిక్స్ చేస్తున్నారా.? ఆ సాంగ్‌ని ఆమె పాడతారా? అనుకుంటున్నారా? అబ్బబ్బే.. అలాంటిదేమీ లేదండోయ్... విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా తీసుకోకండి.. జస్ట్ ఎసెన్స్ ఫీలవ్వండి చాలు.. బ్రహ్మాస్త్ర సినిమా చూశారా.?
Updated on: Jan 01, 2025 | 10:15 PM

నిను వీడని నీడను నేను.. అనే పాటను బాగానే ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు దీపిక పదుకోన్. ఇప్పుడు ఆ పాటను ఎందుకు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది? ఏ మూవీలోనైనా రీమిక్స్ చేస్తున్నారా?

ఆ సాంగ్‌ని ఆమె పాడతారా? అనుకుంటున్నారా? అబ్బబ్బే.. అలాంటిదేమీ లేదండోయ్... విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా తీసుకోకండి.. జస్ట్ ఎసెన్స్ ఫీలవ్వండి చాలు.. బ్రహ్మాస్త్ర సినిమా చూశారా?

అందులో దీపిక మీకు ఎక్కడైనా కనిపించారా? కనిపిస్తే ఏ ఫ్రేమ్‌లో రౌండప్ చేశారు..? ఈ డిస్కషన్ ఆ సినిమా రిలీజ్ టైమ్‌లో యమాగా నడిచింది.. మీకూ గుర్తుండే ఉంటుందిగా.. యస్..

బ్రహ్మాస్త్ర టైమ్ డిస్కషన్‌కి ఇంకా ఫుల్‌స్టాప్ పడలేదు. బ్రహ్మాస్త్ర నెక్స్ట్ పార్టులో దీపిక నటిస్తారనే మాట ఎప్పటి నుంచో ఉంది. మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయకపోయినా,

ఇది కన్‌ఫర్మ్ న్యూసేనని ఫిక్సయిపోయాయి ముంబై వర్గాలు. రణ్‌బీర్ కపూర్ దీపికను మరో సారి స్క్రీన్ మీద చూడటం గ్యారంటీ అన్నది వారి నుంచి వినిపిస్తున్న మాట.

అయితే బ్రహ్మాస్త్ర కన్నా ముందే, రణ్‌బీర్ - ఆలియా నటిస్తున్న సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించడానికి ఓకే చెప్పేశారట దీపిక పదుకోన్. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అంటారా?

లవ్ అండ్ వార్. యస్.. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం దీపికను అప్రోచ్ అయితే, వెంటనే ఓకే చెప్పేశారట.

ఈ వార్త ఇలా బయటికి వచ్చిందో లేదో... ఒక్కసారిగా రామ్‌లీలా, పద్మావత్, బాజీరావ్ మస్తానీ సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్. అంతే కాదు, నియర్ ఫ్యూచర్‌లో రణ్‌బీర్, ఆలియా చేసే సినిమాల్లో దీపిక ప్రెజెన్స్ మస్ట్ గా ఉండి తీరుతుందంతే.. అంటూ గుసగుసలు మొదలయ్యాయి నార్త్ లో.





























