- Telugu News Photo Gallery Cinema photos Power star pawan kalyan is chief guest for ram charan Game changer movie Pre Release Event,
Game Changer: అబ్బాయి కోసం బాబాయ్.! రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేంజర్..
గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచేస్తున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా మెగా సినిమా కాబట్టి.. ఆ మాత్రం మెగా జోష్ ఉండేలా కేర్ తీసుకుంటున్నారు మేకర్స్.ఈ క్రమంలోనే అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్నారు. మరి అవేంటి..? ఇంతకీ గేమ్ ఛేంజర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి..? గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో జోరు పెరుగుతుంది.
Updated on: Jan 01, 2025 | 10:32 PM

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచేస్తున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా మెగా సినిమా కాబట్టి.. ఆ మాత్రం మెగా జోష్ ఉండేలా కేర్ తీసుకుంటున్నారు మేకర్స్.

ఈ క్రమంలోనే అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్నారు. మరి అవేంటి..? ఇంతకీ గేమ్ ఛేంజర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి..? గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో జోరు పెరుగుతుంది.

రిలీజ్‌కు ముందు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒకటి రెండు కాదు.. పుష్ప మాదిరే 5 భారీ వేడుకలు చేయబోతున్నారు.

ఈలోపు ఏపీ, తెలంగాణలోనూ రెండు భారీ ఈవెంట్స్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటికి చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ కూడా వస్తారనే ప్రచారమూ భారీగా జరుగుతుంది.

డిసెంబర్ 29న రామ్ చరణ్ బిగ్గెస్ట్ కటౌట్ లాంఛ్ జరగనుంది. విజయవాడలో 256 ఫీట్లతో కటౌట్ ఏర్పాటు చేసారు. దీనికి ముఖ్య అతిథిగా తమన్ వెళ్తున్నారు.

అలాగే హైదరాబాద్‌లో త్వరలోనే ఓ ఈవెంట్ ఉండబోతుంది. ఈ వేడుకకు చిరంజీవి వస్తారని తెలుస్తుంది. దాంతో పాటు జనవరి 4 లేదా 5 తేదీల్లో ఏపీలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.

విజయవాడ, మంగళగిరి..ఈ రెండింట్లో ఒకచోట జరగబోయే గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ ఛీఫ్ గెస్టుగా వస్తారని తెలుస్తుంది. ఆయన డేట్స్‌ను బట్టే ఈ డేట్ ఫిక్సయ్యేలా ఉంది.

గతంలో రంగస్థలం విజయోత్సవానికి పవన్ వచ్చారు. అప్పట్లో నాయక్ వేడుకలోనూ కనిపించారు. మళ్లీ బాబాయ్ అబ్బాయి కలిస్తే అభిమానులకు ఫుల్ మీల్స్ పక్కా.





























