Tamannaah: తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య.. షాకింగ్ విషయం బయటపెట్టిన విజయ్ వర్మ
బాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకున్న స్టార్ సెలబ్రిటీల్లో విజయ్ వర్మ కూడా ఒకరు. పలు సూపర్ హిట్ సినిమాల్లో తన అద్భుత నటనతో ఆడియెన్స్ ను మెప్పించాడీ ట్యాలెంటెడ్ స్టార్. అలాగే పలు వెబ్ సిరీస్‌లలో కూడా మెరిశాడు.
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ స్వస్థలం హైదరాబాద్. అతను ఇక్కడే పుట్టి పెరిగాడు. నాని నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా మెప్పించిన విజయ్ వర్మ ఇప్పుడు బాలీవుడ్ లోనూ మెరుస్తున్నాడు. పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించి స్టార్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మీర్జాపూర్ వెబ్ సిరీస్, గల్లీ బాయ్స్, డార్లింగ్ వంటి హిందీ చిత్రాల్లో తన నటనతో బాలీవుడ్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు విజయ్. అయితే సినిమాలు, వెబ్ సిరీస్ ల కంటే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో ఉన్న రిలేషన్ షిప్ కారణంగానే విజయ్ వర్మ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. కానీ ఇప్పుడు తన అనారోగ్య సమస్యను బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పాడు. తాను అరుదైన చర్మ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు, మేకప్ కాస్మోటిక్స్ తో దీనికి కవర్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్ సందర్భంగా మాట్లాడిన విజయ్ వర్మ తాను విటిలిగో (బొల్లి) అనే చర్మ సమస్యతో బాధపడుతున్నానన్నాడు. దాని వల్ల తన ముఖంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయని, వాటిని దాచడానికి మేకప్ కాస్మోటిక్స్ ఉపయోగించాల్సి ఉంటుందని ఈ నటుడు వెల్లడించాడు. దీని గురించి మొదట్లో చాలా భయపడ్డాను, సక్సెస్ అందుకున్న తరువాత దాని గురించి ఆలోచించడం మానేసాను అని విజయ్ తెలిపాడు. కాగా బొల్లిని వైట్ స్పాట్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఇది అరుదైన వ్యాధి. ఇది శరీరంలో ఎక్కడైనా రావొచ్చు. చర్మం రంగు మారి తెల్లటి పాచెస్ ఏర్పడుతుంది. వైద్యుల ప్రకారం శరీరంలో మెలనోసైట్లుగా పిలిచే మెలనిన్ కణాల స్థాయి క్షీణించినపుడు చర్మంపై తెల్లటి మచ్చలు వస్తాయి. దీన్నే బొల్లి అంటారు. ఇది అంటువ్యాధి కాదు. బాధితులను తాకడం ద్వారా ఇది వ్యాప్తి చెందదు. కాగా బొల్లికి ఇంకా ఖచ్చితమైన నివారణ లేదు. ఉన్న కొన్ని చికిత్సలు మాత్రమే దాని వ్యాప్తిని ఆపుతాయి. బొల్లి వ్యాధికి ప్రాథమిక లక్షణాలు కనిపించినప్పుడు మందులు, క్రీములతో చికిత్స చేయవచ్చు. దీని కోసం లేజర్ థెరపీని కూడా ఉపయోగిస్తారు.
కాగా లవ్‌బర్డ్స్ తమన్నా భాటియా, విజయ్ వర్మ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని అందరికీ తెలుసు. ఈ విషయాన్ని ఇద్దరూ చాలా ఇంటర్వ్యూలలో ఒప్పుకున్నారు. కొన్ని నివేదికల ప్రకారం, విజయ్, తమన్నా కూడా 2025 లో వివాహం చేసుకోబోతున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
విజయ్ వర్మతో తమన్నా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి