AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు డైనమిక్ పొలిటికల్ లీడర్.. ఎంపీగా బిజి బిజీ

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయ్యారు. ఆ తర్వాత పిల్లల పెంపకంలో బిజీ అయిపోయి సినిమాలకు దూరమైపోతారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే అందాల తార కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది.

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు డైనమిక్ పొలిటికల్ లీడర్.. ఎంపీగా బిజి బిజీ
Tollywood Actress
Basha Shek
|

Updated on: Dec 30, 2024 | 6:52 PM

Share

పేరుకు తెలుగు సినిమా ఇండస్ట్రీనే అయినా ఇక్కడ ఇతర భాషల హీరోయిన్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, ఒడియా, బెంగాళీ.. ఇలా పలు ఎన్నో రకాల భాషలకు చెందిన హీరోయిన్లు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా బెంగాళీనే. కానీ తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ సడెన్ గా టాలీవుడ్ నుంచి మాయమైపోయింది. తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయి సినిమాలు, సీరియల్స్ తో బిజీ బిజీగా మారిపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు అమ్మగా మారిపోయింది. సాధారణంగా తల్లైన తర్వాత సినిమాలు, సీరియల్స్ తగ్గిస్తారు. కానీ ఈ అందాల తార మాత్రం మరింత స్పీడ్ పెంచింది. రియాలిటీ షోలు, టీవీ షోస్ తో బెంగాళీ ఆడియెన్స్ లో పాపులర్ నటిగా మారిపోయింది. ఇదే క్రేజ్ తో ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగింది. తన ఛరిష్మాతో త‌న ప్ర‌త్య‌ర్థి బీజేపీ పార్టీ అభ్య‌ర్థిపై ఏకంగా 70 వేల‌ ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ప్రస్తుతం ఎంపీగా ప్రజా సేవలో బిజి బిజీగా ఉంటోన్న ఆ అందాల తార మరెవరో కాదు రచనా ఛటర్జీ. అదే నండి బావగారు బాగున్నారా సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన అమ్మాయి.

బెంగాల్ కు చెందిన రచన తెలుగులో పిల్ల నచ్చింది, కన్యాదానం, పవిత్ర ప్రేమ, సుల్తాన్, రాయుడు, మావిడాకులు, లాహిరి లాహిరి లాహిరిలో తదితర సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారూ బాగున్నారా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెప్పించింది.కాగా 2002లో వ‌చ్చిన‌ లాహిరి లాహిరిలో సినిమా తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదీ అందాల తార. కానీ త‌న సొంత రాష్ట్రంలో సినిమాలు, టీవీ షోల‌తో బిజీగా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

రచనా బెనర్జీ లేటెస్ట్ ఫొటోస్..

కాగా దీదీ నెం1 అనే టీవీషోతో ప‌శ్చిమ బెంగాల్ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రచన. ఇదే క్రమంలోనే సీఎం మమతా బెనర్జీ స‌మ‌క్షంలో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. ఆ వెంట‌నే వ‌చ్చిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో హూగ్లీ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగింది. త‌న పాపులారిటీ, ఛరిష్మాతో ప్ర‌త్య‌ర్థి బీజేపీ పార్టీ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎంపీ లాకెట్ ఛ‌ట‌ర్జీపై ఏకంగా 70 వేల‌ ఓట్ల మెజార్టీతో గెలుపొందింది.

దీదీ నంబర్ వన్ టీవీ షోలో రచన..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే