Tollywood: 60 ప్లస్‌లోనూ తగ్గేదేలే! జిమ్‌లో కండలు పెంచుతోన్న టాలీవుడ్ నటుడు.. ఎవరో గుర్తు పట్టారా?
సాధారణంగా 60 ఏళ్లు దాటితే చాలామంది రిలాక్స్ అవుతారు. పుస్తకాలు చదవడమో, టీవీలో సినిమాలు చూస్తూ ఇంటికే పరిమితమైపోతారు. అయితే ఈ టాలీవుడ్ నటుడు మాత్రం చాలా డిఫరెంట్. 60 ఏళ్లు దాటినప్పటికీ జిమ్ లో తెగ కష్డపడుతున్నాడు. కండలు పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఈ నటుడికి టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కెరీర్ ఆరంభంలో పలు సినిమాల్లో హీరోగా నటించారు. సహాయక పాత్రలతోనూ మెప్పించారు. ఇక బుల్లితెరపై హోస్ట్ గానూ సత్తా చాటారు. నిర్మాతగానూ తన అభిరుచి చాటుకున్నారు. ఇక ఈ మధ్యన రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలా టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు జిమ్ లో తెగ కష్టపడుతున్నారు. అది కూడా 63 ఏళ్ల వయసులో. భారీ కసరత్తులు చేస్తూ కుర్రాళ్లకు ధీటుగా కండలు పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ జెమ్ మరెవరో కాదు మెగా బ్రదర్ నాగబాబు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన పాలిటిక్స్ లో బిజి బిజీగా ఉంటున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తున్నారు. అలా తాజాగా నాగ బాబు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. ఇందులో జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తూ కనిపించారు మెగా బ్రదర్. భారీ కసరత్తులు చేస్తూ కండలు చూపించారు. అంతేకాకుండా ఈ ఫొటోలకు వ్యాయామం లేనిది.. జీవితమే లేదని క్రేజీ క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. వీటిని చూసిన మెగాభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు నాగ బాబు. ఆయనకు ఏపీ క్యాబినెట్ లో మంత్రి పదవి కూడా రానుందని ఇటీవల బాగా ప్రచారం జరుగుతోంది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. జనవరి 8న ఏపీ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. నాగబాబుకు ఏ శాఖ ఇవ్వాలి అనేదానిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు చర్చించినట్లు తెలుస్తోంది. మెగా బ్రదర్ కు సినిమాటోగ్రఫీ శాఖ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది.
జిమ్ లో మెగా బ్రదర్ నాగబాబు..
View this post on Instagram
భారీ కసరత్తులు చేస్తూ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.