Actress: ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
ప్రముఖ సినీ నటి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రోజువారీ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడగా, నటితో పాటు ఆమె కారు డ్రైవర్ కూడా క్షతగాత్రులయ్యారు. ముంబై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ప్రముఖ మరాఠీ, హిందీ సినీ నటి ఊర్మిళ కొఠారి కారు ప్రమాదానికి గురైంది. నటి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కూలిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. నటి ఊర్మిళ మరియు ఆమె కారు డ్రైవర్‌కు కూడా గాయాలు కాగా, ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్చారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఊర్మిళ కొఠారి గురువారం అర్థరాత్రి సినిమా షూటింగ్ నుండి తిరిగి వస్తుండగా ముంబైలోని కంధివాలి ప్రాంతంలో పోయిసార్ మెట్రో ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న ఇద్దరు కార్మికులను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సరైన సమయంలో ఎయిర్‌బ్యాగ్ తెర్చుకోవడంతో నటి, ఆమె కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి కూడా గాయాలు కాగా, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కొంతమంది ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, నటి హ్యుందాయ్ వెర్నా కారు అతి వేగంతో వెళుతుండగా, అది అదుపు తప్పి కార్మికులపైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న పిల్లర్‌ను ఢీకొట్టింది. సమతా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగ్గా పోలీసులు కారును సీజ్ చేశారు. కారు డ్రైవర్‌పై ఫిర్యాదు నమోదు చేసి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.
ప్రమాదంలో దెబ్బతిన్న హీరోయిన్ కారు.. వీడియో
𝕄𝕌𝕄𝔹𝔸𝕀 | Marathi actress Urmila Kothare met with a car accident after her driver lost control of the car, killing one worker and injuring another. The actress was also injured severely. pic.twitter.com/o9rAPRQS1b
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) December 28, 2024
ఊర్మిళ కొఠారే మరాఠీ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటిగా కొనసాగుతోంది. 2006లో విడుదలైన మరాఠీ చిత్రం ‘శుభ్ మంగళ్ సావధాన్’తో ఆమె సినిమా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. ఆమె బుల్లి తెరపై కూడా సందడి చేసింది. ఊర్మిళతో పాటు ఆమె భర్త ఆదినాథ్ కొఠారే కు కూడా సినిమా ఇండస్ట్రీతో మంచి సంబంధాలున్నాయి. మరాఠీతో పాటు పలు హిందీ చిత్రాలకు కూడా పనిచేశాడు. ఊర్మిళ హిందీ సినిమాలకు కూడా పనిచేసింది. 2022 సంవత్సరంలో, సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవగన్ నటించిన ‘థ్యాంక్ గాడ్’ అనే చిత్రంలో ఆమె సిద్ధార్థ్ సోదరి పాత్రను పోషించింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహి కూడా నటించారు. ఇక 2013లో వచ్చిన ‘వెల్‌కమ్ ఒబామా’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించిందీ అందాల తార.
ఊర్మిళ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.