AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్.. ఎక్కడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా విడుదలై సుమారు 3 వారాలు గడుస్తోంది. అయినా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో సినిమా రన్ అవుతోంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ బన్నీ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1700 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది.

Pushpa 2: పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్.. ఎక్కడంటే?
Pushpa 2 The Rule
Basha Shek
|

Updated on: Dec 27, 2024 | 9:36 PM

Share

అల్లు అర్జున్ పుష్ప 2′ సినిమా చూడటానికి దక్షిణాది ఆడియెన్స్ కంటే ఉత్తరాది ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మాస్ ఆడియెన్స్ మెచ్చే అంశాలు పుష్కలంగా ఈ సినిమాలో ఉండడమే దీనికి కారణం. అందుకే నార్త్ లో పుష్ప 2 సినిమా రూ. 1000 కోట్లకు చేరువలో ఉంది. అయితే ఎంతో కోరికతో సినిమా చూసేందుకు వచ్చిన కొందరు ప్రేక్షకులు నిరాశ చెందారు. ‘పుష్ప 2’ కాకుండా వరుణ్ ధావన్ నటించిన ‘బేబీ జాన్’ సినిమా ప్రదర్శించడంతో ఆశ్చర్యపోయారు. ఈ ఘటన జైపూర్‌లోని ‘రాజ్‌మందిర్‌’ థియేటర్‌లో చోటుచేసుకుంది. బుధవారం (డిసెంబర్ 25) ఉదయం 10.45 గంటలకు ‘పుష్ప 2’ సినిమా చూసేందుకు చాలా మంది ప్రేక్షకులు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. థియేటర్ లోపలికి వెళ్లి కూర్చున్న తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే స్క్రీన్‌ పై ‘పుష్ప 2’ కాకుండా బాలీవుడ్ ‘బేబీ జాన్’ సినిమా ప్రదర్శితమైంది. అల్లు అర్జున్‌ని తెరపై చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు వరుణ్ ధావన్‌ను చూసి షాక్ అయ్యారు. వెంటనే కొందరు ప్రేక్షకులు గొడవ చేశారు. మరి కొంత మంది ప్రేక్షకులు విధిలేక ‘బేబీ జాన్’ సినిమానుచూశారు. ఇంకొందరు ఇంటికి వెళ్లిపోయారు.

అయితే షో మార్పుపై బుక్ మై షో నుంచి తమకు ఎలాంటి మెసేజ్ రాలేదని, టికెట్ కోసం చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో రాజ్‌మందిర్‌ థియేటర్‌ ముందు గందరగోళం నెలకొంది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ తదితరులు నటించిన చిత్రం ‘బేబీ జాన్’. ఈ చిత్రం తమిళ హిట్ సినిమా ‘తేరి’కి బాలీవుడ్‌ రీమేక్‌. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ అందుకుంది.

ఇవి కూడా చదవండి

1700 కోట్లను దాటేసిన పుష్ప 2

హిందీలోనూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..