- Telugu News Photo Gallery Cinema photos Ram Charan and Upasana Christmas celebrations photos go viral
Ram Charan: ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్ వైరల్
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ పర్వదినాన్ని ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు తమ ఇంట్లో పని చేసేవారితో క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం విశేషం.
Updated on: Dec 25, 2024 | 10:42 PM

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు పండగలు, పర్వదినాలను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో సెలబ్రేట్ చేసుకుంటారు.అయితే రామ్ చరణ్- ఉపాసన దంపతులు మాత్రం ఈ విషయంలో మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు

బుధవారం రామ్ చరణ్ ఇంట్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. భార్య ఉపాసన కూడా ఈ వేడుకల్లో పాల్గొంది. వీరితో పాటు ఇంట్లో పనిచేసే సిబ్బంది ఈ వేడుకల్లో భాగం కావడం విశేషం.

అలాగే అపోలో సిబ్బంది కూడా ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు రామ్ చరణ్- ఉపాసన

ప్రస్తుతం రామ్ చరణ్ క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తమ వద్ద పనిచేసేవారితో పండగను సెలబ్రేట్ చేయడం గ్రేట్ అంటూ అభిమానులు రామ్ చరణ్ దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు

ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.





























