Reeshma Nanaiah: యూఐ సినిమాతో యూత్ క్రష్‌గా మారిన రీష్మా.. ఈ హీరోయిన్ వయసు ఎంతో తెలిస్తే..
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర చాలా కాలం తర్వాత అడియన్స్ ముందుకు వచ్చారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన యూఐ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఇందులో రీష్మా కథానాయికగా నటించి మెప్పించింది. కన్నడ బ్యూటీ రీష్మా నానయ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి..
Updated on: Dec 25, 2024 | 10:43 PM

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన యూఐ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో యూత్ క్రష్ గా మారింది రీష్మా నానయ్య. ఇప్పుడు ఈ అమ్మడు గురించి తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. రీష్మా నానయ్య.. యూఐ సినిమాలో అందం, అభినయంతో కట్టిపడేసింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ అమ్మడు వయసు తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంటున్న రీష్మా 28 ఏప్రిల్ 2001న జన్మించింది.

అవును.. ఈ అందమైన అమ్మాయి 2K పిల్ల. ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రీష్మా అనేక చిత్రాల్లో నటించింది.

కానీ ఇప్పుడు ఉపేంద్ర నటించిన యూఐ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రీష్మా పేరు సోషల్ మీడియో తెగ మారుమోగుతుంది. ఈ బ్యూటీని పుష్ప 2లో కిస్సిక్ ఫేమ్ శ్రీలీలతో పోలుస్తున్నారు నెటిజన్స్.




