- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun's Pushpa 2 Movie Collections in bollywood on 26 12 2024
Pushpa 2: రప్ప.. రప్ప.. ఆగని పుష్ప 2 రికార్డుల దండయాత్ర
అనుకున్నట్లుగానే బాలీవుడ్‌లో పుష్ప 2 దండయాత్ర కొనసాగుతూనే ఉంది. మూడు వారాల తర్వాత కూడా బాక్సాఫీస్‌పై విరుచుకుపడుతున్నాడు పుష్ప రాజ్. తాజాగా ఈయన దెబ్బకు మరో రికార్డు నమోదైంది. బాలీవుడ్ కల్లో కూడా చూడని విధంగా 700 కోట్ల రికార్డు సెట్ చేసింది. మరి 100 నుంచి 600 కోట్ల క్లబ్బులో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన సినిమాలేంటో చూద్దామా..?
Updated on: Dec 26, 2024 | 1:18 PM

ఇప్పటికే చాలా రికార్డులు పుష్ప ఖాతాలో చేరిపోయాయి. మరి బాహుబలి 2తో ఉన్న రికార్డుల్ని సైతం పుష్ప రాజ్ లాగేసుకుంటాడా..? ఇప్పటి వరకు ఎంతొచ్చింది..?

బాలీవుడ్‌లో 700 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా ఇదే. ఇదే ఏడాది స్త్రీ 2 తొలిసారి 600 కోట్ల క్లబ్బులో చేరింది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా అమర్ కౌశిక్ తెరకెక్కించిన స్త్రీ 2 ఫస్ట్ డే నుంచే రికార్డులు తిరగరాసింది.

ఇక బాలీవుడ్‌లో 500 కోట్ల క్లబ్ మొదలు పెట్టిన సినిమా బాహుబలి 2. 2017లో ఈ చిత్రం తొలిసారి 500 కోట్లకు పైగా వసూలు చేసింది.. 400 కోట్లు వసూలు చేసిన తొలి హిందీ సినిమా కూడా బాహుబలి 2నే.

బాలీవుడ్‌కు 300 కోట్ల సినిమాను పరిచయం చేసింది అమీర్ ఖాన్. 2014లో ఈయన నటించిన PK సినిమా తొలిసారి 300 కోట్లు వసూలు చేసింది. ఇక 2009లో విడుదలైన 3 ఇడియట్స్ తొలిసారి 200 కోట్లు వసూలు చేసింది.

కనిపించిన ఏ ఒక్క రికార్డును కూడా వదిలట్లేదు పుష్ప రాజ్. కనుచూపు మేరలో మరే రికార్డు కనబడకుండా.. అన్నింటినీ తుడిచి పెట్టేస్తున్నాడు.




