- Telugu News Photo Gallery Cinema photos Keerthy suresh, sai pallavi, sreeleela, tollywood, tollywood news
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఆరు రోజులు పని చేస్తే.. ఓరోజు సెలవు కావాలంటాం..! ఎంతైనా వారమంతా పనిచేసి అలిసిపోతాం కదా..! హీరోయిన్లు కూడా అంతే. ఒక్కోసారి బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తుంటారు పాపం. అందుకే కొందరు బ్యూటీస్ ఇప్పుడు వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలు చేస్తూనే.. పర్సనల్ స్పేస్ తీసుకుంటున్నారు. మరి వాళ్లెవరు..?
Phani CH |
Updated on: Dec 26, 2024 | 9:00 PM

ఆరు రోజులు పని చేస్తే.. ఓరోజు సెలవు కావాలంటాం..! ఎంతైనా వారమంతా పనిచేసి అలిసిపోతాం కదా..! హీరోయిన్లు కూడా అంతే. ఒక్కోసారి బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తుంటారు పాపం. అందుకే కొందరు బ్యూటీస్ ఇప్పుడు వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలు చేస్తూనే.. పర్సనల్ స్పేస్ తీసుకుంటున్నారు. మరి వాళ్లెవరు..?

సాయి పల్లవి ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో చెప్పనక్కర్లేదు. తెలుగులో తండేల్.. హిందీలో రామాయణ్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అందుకే కాస్త రిలాక్సేషన్ కోసం చెల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు సాయిపల్లవి. అక్కడి బీచ్‌లలో సేద తీరుతున్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయిప్పుడు.

త్రిష కూడా మామూలు బిజీగా లేరిప్పుడు. తెలుగులో చిరుతో విశ్వంభరతో పాటు.. తమిళంలో అజిత్, విజయ్, సూర్య లాంటి సీనియర్ హీరోలతో నటిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. కాస్త రిలీఫ్ కోసం తాజాగా పటాయ బీచ్‌కు వెళ్లారు. థాయ్‌లాండ్‌లో త్రిష ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ మాస్ జాతరతో పాటు నాగ చైతన్య , కార్తిక్ దండు సినిమాలోనూ శ్రీలీలనే హీరోయిన్‌గా తీసుకున్నారు.

ఇక కీర్తి సురేష్ సైతం బేబీ జాన్ రిలీజ్ తర్వాత వెకేషన్ వెళ్లనున్నారు. ఇలా టాలీవుడ్ బ్యూటీలు అందరు సినిమాలు చేస్తూనే.. పర్సనల్ స్పేస్ తీసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.