- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Is Now Acting Prabhas Raja Saab Movie, She Is Malavika Mohanan
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
ఎలాంటి మేకప్ లేకుండా న్యాచురల్ లుక్‌లో కనిపిస్తున్న ఓ హీరోయిన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అప్పట్లో ఎంతో పద్ధతిగా కనిపించిన ఆ అమ్మాయి.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ ఫోజులతో మెంటలెక్కిస్తోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా..? ఇన్నాళ్లు తమిళం, కన్నడలో సినిమాలు చేసిన ఈ హీరోయిన్ ఇప్పుడు నేరుగా తెలుగులో ఓ మూవీ చేస్తుంది.
Updated on: Dec 26, 2024 | 6:32 PM

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది హీరోయిన్ మాళవిక మోహనన్. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు పదేళ్లు అవుతున్నప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. పదేళ్లలలో పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు.

కానీ ఈ అమ్మడుకు ఎక్కువగా భారీ బడ్జెట్ చిత్రాల్లోనే ఆఫర్స్ వస్తున్నాయి. ఎక్కువగా కన్నడ, మలయాళం, తమిళ సినిమాల్లోనే నటించింది. కానీ ఇప్పుడు నేరుగా తెలుగులో ఓ సినిమా చేస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ చిత్రంలో ఈ బ్యూటీ ఆఫర్ కొట్టేసింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ డ్రామాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు.

మాళవిక సినీ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయే. ఆమె తండ్రి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్. అతడు ‘డాన్’, ‘తలాష్’, ‘ఫుక్రీ’ ‘రయీస్’ తదితర హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

తమిళంలో రజినీకాంత్, విజయ్ దళపతి, ధనుష్, విక్రమ్ చియాన్ వంటి సినిమాల్లో నటించి ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత మలయాళంలోనూ ఓ మూవీలో నటించింది. ప్రస్తుతం రాజాసాబ్ చిత్రంలో నటించింది.





























