AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cigarettes: ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?

ధూమపానం చాలా మందికి ఇష్టమైన అలవాటు. ముఖ్యంగా కొంతమంది ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆందోళనగా ఉన్నప్పుడు సిగరెట్లు వరుస పెట్టా తాగుతుంటారు. అయితే నిజంగా సిగరెట్లు తాగడం వల్ల మైండ్‌ రిల్సాక్‌ అవుతుందా? ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది...

Cigarettes: ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
Smoking Cigarettes
Srilakshmi C
|

Updated on: Mar 01, 2026 | 8:25 PM

Share

సిగరెట్లు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు చూపుతాయి. అయినప్పటికీ ధూమపానం చాలా మందికి ఇష్టమైన అలవాటు. ముఖ్యంగా కొంతమంది ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆందోళనగా ఉన్నప్పుడు సిగరెట్లు వరుస పెట్టా తాగుతుంటారు. అయితే నిజంగా సిగరెట్లు తాగడం వల్ల మైండ్‌ రిల్సాక్‌ అవుతుందా? ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఎందుకుంటే చాలా మంది చెప్పే విషయం.. ఒత్తిడికి గురైనప్పుడు సిగరెట్ కాల్చితే రిలాక్స్‌గా ఉంటుంది అని. చాలా మంది ఇలా చెప్పడం మీరు విని ఉంటారు. కాబట్టి సిగరెట్లు నిజంగా ఒత్తిడి తగ్గిస్తుందా? ఇది మనశ్శాంతిని ఇస్తుందా? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

ధూమపానం నిజంగా ఒత్తిడిని తగ్గిస్తుందా?

పొగాకులో నికోటిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది తేలికపాటి ఉద్దీపన లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది కొన్ని నిమిషాల పాటు ఉపశమన అనుభూతిని కలిగిస్తుంది. ఈ నికోటిన్ శరీరం డోపమైన్ వంటి హార్మోన్లను విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచే హార్మోన్. ఈ హార్మోన్ శరీరంలో విడుదలైనప్పుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. అందుకే చాలా మంది సిగరెట్ తాగిన తర్వాత వారికి ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు.

నికోటిన్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కానీ అది కొన్ని సెకన్ల నుంచి నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. ధూమపానం మానసిక ఒత్తిడిని తగ్గించదు. పైగా కాలక్రమేణా శరీరం నికోటిన్‌ను కోల్పోతున్నప్పుడు, అది విశ్రాంతి లేకపోవడం, చిరాకును పెంచడం వంటివి కలిగిస్తుంది. నికోటిన్ స్థాయిలు తగ్గినప్పుడు మళ్ళీ ధూమపానం చేయాలనే కోరికను కలిగిస్తుంది. ఈ చక్రం శరీరం, మనస్సుపై ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఇది ఆందోళన, చిరాకు, నిద్రలేమిని కూడా పెంచుతుంది. ఎక్కువసేపు ధూమపానం చేసేవారికి ఊపిరితిత్తుల వ్యాధి, శ్వాస ఆడకపోవడం, దగ్గు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మొత్తంమీద ధూమపానం ఒత్తిడి నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తుందన్నమాట. కానీ దీర్ఘకాలంలో ఇది మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించడానికి, మనస్సును విశ్రాంతి తీసుకోవడానికి ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించడం మంచి ఎంపిక.

ఇవి కూడా చదవండి

ఒత్తిడిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన మార్గాలు ఇవిగో..

ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి ధూమపానానికి బదులుగా కొన్ని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటంటే..

  • వ్యాయామం – యోగా: ఇది ఎండార్ఫిన్‌లను విడుదల చేయడం ద్వారా మనస్సును ప్రశాంతపరుస్తుంది.
  • ధ్యానం – మైండ్‌ఫుల్‌నెస్: ఇది మానసిక శాంతి, ప్రశాంతతను అందిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది.
  • ఆరోగ్యకరమైన ఆహారం: చక్కెర – కెఫిన్ తీసుకోవడం నియంత్రించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ మానసిక స్థితి సమతుల్యంగా ఉంటుంది.
  • సామాజిక మద్దతు: ఒంటరిగా కూర్చుని సిగరెట్లు కాల్చే బదులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • అభిరుచులు – సృజనాత్మక కార్యకలాపాలు: డ్రాయింగ్, పెయింటింగ్, తోటపని మొదలైన కార్యకలాపాలలో పాల్గొనాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మీలో సానుకూలతను పెంచుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర