Venkatesh: హీరో కాకపోతే వెంకటేశ్ ఏమయ్యేవారో తెలుసా..? ఆసక్తికర విషయాలు బయటపెట్టిన వెంకీమామ…
విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం తన కొత్త సినిమా సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో టాక్ షోలో పాల్గొన్నారు.
నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఇప్పటికే మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు నాలుగో సీజన్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ సీజన్ లో ఆరు ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఏడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ లో విక్టరీ వెంకటేశ్ సందడి చేశారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సురేష్ బాబు సైతం ఈ షోలో పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత వెంకీమామ, బాలకృష్ణ ఇద్దరూ ఒకే స్టేజ్ పై కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో వెంకటేశ్ తన సినిమాలు, ఫ్యామిలీ గురించి, పిల్లలు, తండ్రి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
దివంగత ప్రొడ్యూసర్ రామానాయుడు తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టారు విక్టరీ వెంకటేశ్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అయితే వెంకటేశ్ ఫారెన్ లో చదువుకొని వచ్చి హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని బాలకృష్ణ ప్రస్తావిస్తూ.. అసలు నువ్వు హీరో అవ్వకపోతే ఏం అయ్యేవాడివి.. నువ్వేం చేయాలనుకున్నావు అని అడగ్గా.. వెంకటేశ్ మాట్లాడుతూ.. “నాకు ఫారెన్ వెళ్లాలి. తిరగాలి అని ఉండేది. క్యాలిఫోర్నియాలోని బీచ్ సైడ్ ఒక ఇల్లు కట్టుకుని అక్కడే ఉండిపోవాలని అనుకున్నాను. కానీ కుదరక ఇక్కడికి వచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. కానీ అది ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత మా నాన్నగారు రాఘవేంద్రరావు గారిని కలిసి నా గురించి చెప్పారు. అలా మొదటిసారి కలియుగ పాండవులు సినిమా చేశాను. సరే ఇది కూడా ఒక ట్రయిల్ వేద్దామని సినిమాలు స్టార్ట్ చేశాను” అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14న విడుదలకానుంది. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.