Bigg Boss Telugu: బుద్ధిగా పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళుతోన్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. త్వరలో లాయర్‌గా..
ఇప్పుడంటే చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే గతంలో ఇప్పుడున్న సకల సదుపాయాలు లేవు. వీటికి తోడు ఇంటిబాధ్యతలో, ఇతర కారణాలతో చాలామంది చదువుకు దూరమైపోయారు. ఇందులో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఉన్నారు. అయితే వీరిలో చాలామంది మళ్లీ పుస్తకాలు పట్టుకుంటున్నారు.
చదవుకు వయసుతో సంబంధం లేదు. ఈ మాటను నిరూపిస్తూ ఎంతో మంది వృద్ధులు సైతం ఇప్పుడు పది, ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరవుతున్నారు. చిన్నప్పుడు వేర్వేరు కారణాలతో చదువుకు దూరమైన వీరు ఇప్పుడు తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. పుస్తకాలు పట్టుకుని మళ్లీ పాఠశాలలు, కాలేజీలకు వెళుతున్నారు. అందులో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి కూడా చేరాడు. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ రివ్యూలు చెప్తూ ఫేమస్ అయిన ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 6వ సీజన్‌లో కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి తన ఆట, మాటతీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. ఫైనల్ వరకు వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా తనదైన శైలిలో బిగ్ బాస్ షో రివ్యూలు చెబుతూ బాగానే పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఆదిరెడ్డి మళ్లీ కాలేజీ స్టూడెంట్ గా మారాడు. బుద్దిగా పుస్తకాలు పట్టుకుని కళాశాలకు వెళుతున్నాడు. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తను లా చదవబోతున్నట్టు, లాయర్ అవ్వడం తన డ్రీం అన్నట్టు, ఆల్రెడీ లా కాలేజీలో చేరినట్టు ఒక వీడియోను షేర్ చేశాడు ఆదిరెడ్డి. అందులో అతను బుద్ధిగా పుస్తకాలు పట్టుకుని కాలేజీ నుంచి రావడం చూడవచ్చు. క నెల్లూరులోని VR లా కాలేజీలో ఆదిరెడ్డి చేరినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఆదిరెడ్డి షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. తన ప్రయత్నం సక్సెస్ అవ్వాలంటూ బిగ్ బాస్ అభిమానులు, నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా కెరీర్ ప్రారంభంలో ఓ చిన్న ఎలక్ట్రిలక్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేశాడు ఆదిరెడ్డి. అదే సమయంలో సినిమాలు, క్రికెట్, ఇతర సోషల్ ఇన్సిడెంట్స్ పై వీడియోలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక బిగ్ బాస్ రియాల్టీ షోపై కూడా వీడియోలు చేసి ఆ తర్వాత అదే రియాలిటీ షోలో కామన్ మ్యాన్ కేటగరిలో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు.
లా కాలేజీలో ఆది రెడ్డి..
View this post on Instagram
ఇప్పుడు కూడా బిగ్ బాస్ రివ్యూలు ఇస్తున్నాడు ఆదిరెడ్డి. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు. తన భార్య, పాప, తల్లితండ్రులతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇక ఆది రెడ్డి సోదరి, భార్య కూడా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం విశేషం.
ఫ్యామిలీతో ఆదిరెడ్డి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.