Brahmamudi, December 27th Episode: కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..

కావ్య అందరి ముందూ తిట్టడంతో స్వప్న చాలా బాధ పడుతుంది. దొరికిందే కదా ఛాన్స్ అనుకుని రుద్రాణి, రాహుల్‌లు కలిసి పుల్లలు పెట్టాలని చూస్తారు. అయినా స్వప్న పట్టించుకోకుండా వాళ్లకే రివర్స్ వార్నింగ్ ఇస్తుంది. వెళ్లి కావ్యని నిలదీస్తుంది. నేను ఇంతే.. నీ హద్దుల్లో నువ్వు ఉండు అంటూ అంటుంది..

Brahmamudi, December 27th Episode: కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Dec 27, 2024 | 11:34 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మా అత్తగారికి కానీ, మీ అత్తగారికి కానీ లేదు. వాళ్లను నిందించినా, మధ్యలోకి లాగినా మర్యాదగా ఉండదని కావ్య అంటే.. రాజ్ విన్నావా నీ భార్య ఎలా మాట్లాడుతుందో అని రుద్రాణి అంటే.. విన్నాను అంతా చూశాను.. నా భర్య ఏం చేసినా ఈ ఇంటి కోసమే చేస్తుంది. ఎక్కువగా మాట్లాడితే మీ అందర్నీ ఉద్యోగాలు చేసి బ్రతకమంటుంది అంత వరకు తెచ్చుకోవద్దని కావ్య చేయి పట్టుకుని తీసుకెళ్తాడు రాజ్. మరోవైపు కావ్య అవమానించిందని స్వప్న బాధ పడుతుంది. చెల్లెలు.. చెల్లులూ అని నెత్తిన పెట్టుకుంటే నాకే చివాట్లు పెట్టింది అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రుద్రాణి, రాహుల్‌లు వచ్చి.. సొంత చెల్లి అయినా ఎవరి స్వార్థం వారిదే అంటూ రుద్రాణి అంటుంది. ఎవరి గురించి మీరు మాట్లాడేది? అని స్వప్న అంటే.. కావ్య గురించి నా ముందే నా భార్యని అవమానించింది కదా దాని గురించి అని రాహుల్ అంటాడు.

స్వప్నని తనవైపుకు తిప్పుకోవాలనుకున్న రుద్రాణి..

సొంత చెల్లి అని నెత్తిన పెట్టుకుని ఊరేగావు కదా.. అదే నెత్తిన శివతాండవం ఆడింది. ఇప్పుడైనా జాగ్రత్త పడు.. ఇక నుంచి నువ్వు కూడా మాతో చేతులు కలుపు అంటూ కావ్య మీద మాటలు ఎక్కిస్తుంది రుద్రాణి. అయినా పట్టించుకోని స్వప్న.. మిమ్మల్ని ఎలా కొడితే మీకు బుద్ధి వస్తుందా? అని ఆలోచిస్తున్నా.. ఎక్కడ ఛాన్స్ దొరికితే పుల్లలు పెట్టే బుద్ధి మీకు తగ్గదు.. నాకు నా చెల్లెల్లి మీద ప్రేమ కూడా తగ్గదు. అయినా నన్ను తిట్టింది నా చెల్లే కదా.. బాధ్యతలో నా తల్లిలా ప్రవర్తిస్తుంది. నిజంగానే తను ఆ చెక్ ఇంటి ఖర్చుల కోసమే ఇచ్చింది. తొందర పడి నేనే నెక్లెస్ కొనుక్కున్నా.. అందుకే తను తిట్టింది. నేను పడ్డాను. ఇక మీరు మారరా.. ఎప్పుడూ ఆస్తిని ఎలా కాజేయాలి? ఇంటిని ఎలా ముక్కలు చేయాలా అని ఆలోచనలేనా అని తిడుతుంది స్వప్న. ఇంకో ఛాన్స్ దొరికితే దీన్ని పూర్తిగా మార్చేయవచ్చని రుద్రాణి వాళ్లు అనుకుంటారు.

నీ హద్దుల్లో నువ్వు ఉండు..

ఆ తర్వాత నేరుగా కావ్య దగ్గరకు వెళ్తుంది స్వప్న. నీ దృష్టిలో నేను కూడా పరాయిదానిలా కనిపిస్తున్నానా అని అడుగుతుంది. తొడబుట్టిన వాళ్లు ఎక్కడైనా పరాయివాళ్లలా కనిపిస్తారా.. పిచ్చి దానివా నేను నీ చెల్లెల్నే అంటూ కావ్య అంటుంది. చాలు ఆపు.. నీకు తెలీకుండా నువ్వు ఇచ్చిన చెక్‌తో నెక్లెస్ కొనుక్కుంటే అందరి ముందూ బయట పెట్టి.. నా పరువు తీస్తావా అని స్వప్న అడిగితే.. తప్పు ఎవరు చేసినా తప్పు అనే అంటాను. సొంత అక్కవి చెల్లెలు ఒక్క మాట అంటే పడవా అని కావ్య అంటే.. నీ ఫ్యామిలీ వేరు.. నా ఫ్యామిలీ వేరు అని అనలేదా? అని స్వప్న అంటే.. అక్కా మనకు ఒకరు హద్దులు నేర్పకూడదు. ఇంకొకరితో అనిపించుకునే అవకాశం ఇవ్వకూడదు. ఇంట్లో ఏం చేస్తున్నావో చూస్తున్నావు కదా.. అని కావ్య అంటే.. అనేవాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారు. కానీ నువ్వు నన్ను అన్నావు. అవన్నీ కాదే.. ఆస్తి నీ చేతికి వచ్చే సరికి నువ్వు మారిపోయావు. అసలు స్వరూపం బయట పడిందని స్వప్న అంటే.. చాలు ఆపు.. అవును నేను ఇంతే.. వాళ్లకూ చెప్పాను.. నీకూ చెబుతున్నా ఏమన్నా కావాలంటే నీ మొగుడిని అడగు. నీకు ఈ మాత్రం నీడ కూడా ఉండదని కావ్య అంటుంది. దీంతో స్వప్న చాలా బాధ పడుతుంది. ఈ దెబ్బతో కావ్యకు విరుద్ధంగా మారే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ధాన్యలక్ష్మి ఆక్రోశం..

మరోవైపు గదికి వచ్చి ఉక్రోశంతో రగిలిపోతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇప్పుడు నీ బాధ ఏంటి? అని ప్రకాశం అడుగుతాడు. ఏంటండీ రోజురోజుకూ ఈ ఇంట్లో రాక్షసులు రాజ్యం ఏలుతున్నట్టు ఉందని ధాన్యలక్ష్మి అంటే.. ఈ ఇంటి గురించి ఇలా మాట్లాడితే కళ్లు పోతాయి. నాన్న గారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లు ఇది. కడుపులో ఏం ఉందో కక్కి చావమని ప్రకాశం అంటాడు. నా బాధ మీకు అర్థం కాదులే.. మొదటి నుంచి ఎప్పుడూ మీరు ఇంతే. అసలు మనకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు ఆలోచించడం లేదు. తినే తిండి గురించి కూడా పోరాడాల్సి వస్తుంది. మన కొడుక్కి రావాల్సిన ఆస్తి రావాల్సిందే. సొంత అక్కని కూడా లెక్క చేయలేదు. నా బాధ అర్థం చేసుకోండి. ఇప్పటికైనా జాగ్రత్త పడాలని ధాన్యలక్ష్మి అంటుంది. సరే ఈ విషయంలో అన్నయ్యను అడగాలా అడుగుతానని ప్రకాశం అంటాడు.

నా రియాక్షన్ ఇలానే ఉంటుంది..

మరోవైపు కావ్య గదికి వస్తుంది. కోపం ఇంకా తగ్గినట్లు లేదు అని రాజ్ అంటే.. నువ్వు రెండు సార్లు ఎవరి మీద అరిచావో వాళ్ల మీద అని రాజ్ అంటే.. మా అక్క మీదనా.. అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటారు? ఓదార్చమంటారా.. నేను చాలా అలిసి పోయాను. ఏమన్నా ఉంటే రేపొద్దున్న మాట్లాడుకుందామని కావ్య అంటే.. నువ్వు చాలా తప్పు చేశావు. స్వప్నని అలా తిట్టకుండా ఉండాల్సింది. మీ అక్కకి నిజం చెబితే అర్థం చేసుకుంటుంది కదా అని రాజ్ అంటే.. మా అక్కకి కంగారు ఎక్కువ. ఇప్పుడు ఈ నిజం చెప్తే అందరికీ చెప్పేస్తుంది. ఇప్పుడు ఏమైంది.. నన్ను తిట్టుకునే వాళ్లతో జాయిన్ అవుతుంది అంతే కదా.. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. చూడండి మనం తాతయ్య గారి మాట నిలబెట్టాలి అనుకున్నాం. అది పూర్తి అయ్యే వరకు నన్ను ఎవరు ఎలా తిట్టుకున్నా పర్వాలేదు. నా రియాక్షన్ మాత్రం ఇలానే ఉంటుందని కావ్య అంటుంది.

మా అక్క నెక్లెస్ అమ్మేస్తా..

ఇక తెల్లవారుతుంది.. రాజ్ గదిలో తిరుగుతూ ఉంటే.. తిరగండి చూడ ముచ్చటగా ఉందని కావ్య అంటుంది. ఏంటి నేను టెన్షన్ పడుతుంటే నీకు చూడముచ్చటగా ఉందా? ఓ ఐదు లక్షల కోసం నేను టెన్షన్ పడటం నేను ఎప్పుడూ చూడలేదని రాజ్ అంటే.. అందుకే ఉన్నాయి కదా అని అసమర్థులకు కోట్లకు కోట్లు.. అపాత్రాధానం చేస్తే దేవుడు ఇలానే మొట్టికాయ వేస్తాడని కావ్య అంటుంది. ఇది ఆ క్యాన్సర్ కనకం దగ్గర నేర్చుకున్నావా.. ఏ తాతయ్య బిల్ కట్టలేదు దాని గురించి టెన్సన్ పడుతున్నానని రాజ్ అంటే.. సరే నిన్న మా స్వప్న అక్క నెక్లెస్ నా మొహాన కొట్టింది కదా అది అమ్మేసి ఆస్పత్రి బిల్ పే చేద్దామని కావ్య అంటే.. నీ లాగా స్వప్నకు ఇంటి బాధ్యతలు తెలీవు. గారాబంగా పెరిగింది.. ఇప్పుడు అది అమ్మితే బాగోదు. పరిస్థితులు బాగున్నప్పుడు మా తాతయ్య ఎప్పుడూ వేరుగా చూడలేదు. ఈ డబ్బు వల్ల నీకు సపోర్ట్ చేసే స్వప్నతో విరోధం తెచ్చుకోవడం నాకు నచ్చలేదని రాజ్ అంటాడు. మరి అయితే ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందని కావ్య అడుగుతుంది. నేనే ఏదో ఒకటి చేస్తానని రాజ్ అంటాడు.

నిజం బటయ పడుతుందా..

మరోవైపు ధాన్య లక్ష్మి, ప్రకాశాన్ని తీసుకొచ్చి.. మీ అన్నయ్యని అడుగుతాను అన్నారు కదా అడగమని తోస్తూ ఉంటుంది. తర్వాత చూద్దామని ప్రకాశం అంటే.. లేదు ఇప్పుడే అడగమని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే సుభాష్‌కి ఫోన్ వస్తుంది. ఆస్పత్రి బిల్ పే చేయలేదని అడుగుతాడు. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్‌లో.. 100 కోట్ల నిజం బయట పడుతుందో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
హీరో కాకపోతే వెంకటేశ్ ఏమయ్యేవారో తెలుసా..?
హీరో కాకపోతే వెంకటేశ్ ఏమయ్యేవారో తెలుసా..?
వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!