Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice Water: బియ్యం కడిగిన నీళ్లతో అందం, ఆరోగ్యం.. డోంట్ మిస్!

ఈ మధ్య కాలంలో ఎక్కువగా బియ్యం కడిగిన నీళ్ల గురించి చాలానే వినిపిస్తున్నాయి. కొంత మంది వాటిని ఫాలో చేస్తే.. మరి కొంత మంది అస్సలు పట్టించుకోరు. కానీ బియ్యం కడిగిన నీళ్లతో ఉండే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావని ఆరోగ్య నిపుణులే స్వయంగా చెబుతున్నారు. ముఖ్యంగా కొరియన్స్ బియ్యం కడిగిన నీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే వారు అంత ఫిట్‌గా, అందంగా కనిపించడానికి ఈ వాటర్ కూడా కారణమని..

Rice Water: బియ్యం కడిగిన నీళ్లతో అందం, ఆరోగ్యం.. డోంట్ మిస్!
Rice Water
Follow us
Chinni Enni

|

Updated on: Jul 02, 2024 | 1:50 PM

ఈ మధ్య కాలంలో ఎక్కువగా బియ్యం కడిగిన నీళ్ల గురించి చాలానే వినిపిస్తున్నాయి. కొంత మంది వాటిని ఫాలో చేస్తే.. మరి కొంత మంది అస్సలు పట్టించుకోరు. కానీ బియ్యం కడిగిన నీళ్లతో ఉండే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావని ఆరోగ్య నిపుణులే స్వయంగా చెబుతున్నారు. ముఖ్యంగా కొరియన్స్ బియ్యం కడిగిన నీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే వారు అంత ఫిట్‌గా, అందంగా కనిపించడానికి ఈ వాటర్ కూడా కారణమని చెబుతూ ఉంటారు. ఇప్పటికే అందుకు సంబంధించిన వీడియోలు కూడా చూశాం. అయితే వీటిని ఎలా వాడాలో చాలా మందికి తెలీదు. మనం ఏదో ఒక పూట అన్నాన్ని తీసుకుంటూ ఉంటాం. ఎవరైనా సరే బియ్యాన్ని కడిగే అన్నాన్ని వండుతారు. ఎందుకంటే వీటిపై ఏదైనా డస్ట్ వంటివి ఉంటే పోతుందని. కానీ బియ్యం కడిగిన నీటిలోనే అసలైన ప్రయోజనాలు ఉన్నాయట. అది తెలీక మనం నీళ్లను పారబోతూ ఉంటాం. ఇకపై అలా చేయ్యకండి. ఈ నీళ్లతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. మనకు ఎన్ని బెనిఫిట్స్ కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రింక్ మాదిరి..

చాలా మంది ఈ నీళ్లను పడేస్తూ ఉంటారు. కానీ ఈ నీళ్లలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం కోల్పోయిన మినరల్స్, ఎలక్ట్రోలైట్లను తిరిగి లభిస్తాయి.

వెయిట్ లాస్:

వెయిట్ లాస్ అవ్వాలని చాలా మంది ఈ మధ్య కష్ట పడుతూ ఉంటున్నారు. అలాంటి వారు ఈ నీటిని తాగడం వల్ల మరింత బెనిఫిట్. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తుంది. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

జుట్టు ఆరోగ్యం:

బియ్యం కడిగిన నీటితో జుట్టును కడగటం వల్ల జుట్టు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. తల స్నానం చేసిన తర్వాత బియ్యం కడిగిన నీటిని తలపై నుంచి వేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు బలంగా ఉంటుంది.

అందం పెరుగుతుంది:

ఈ నీటిని తాగడం వల్ల కూడా అందం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ నీటితో ముఖాన్ని తరచూ కడుగుతూ ఉంటే చర్మ కాంతివంతం అవుతుంది. చర్మంపై ఉండే దుమ్ము, ధూళి పోతుంది. ఇలా ఇంకా చాలా ప్రయోజనాలే ఉన్నాయి.

మొక్కల ఆరోగ్యం:

బియ్యం కడిగిన నీటిని వృథాగా పారబోయకుండా మొక్కలు వేస్తే.. అవి ఆరోగ్యంగా పెరుగుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రాత్రుల్లో WiFi రూటర్‌ ఆన్ లేదా ఆఫ్‌లో ఉంచాలా?
రాత్రుల్లో WiFi రూటర్‌ ఆన్ లేదా ఆఫ్‌లో ఉంచాలా?
2 గంటలు నాన్ స్టాప్ థ్లిల్లింగ్.. ఊహించని ట్విస్టులు..
2 గంటలు నాన్ స్టాప్ థ్లిల్లింగ్.. ఊహించని ట్విస్టులు..
ఉగాది ఉత్సవంలో బోనాల జాతర.. షడ్రుచుల పచ్చడితో పాటే చుక్కా.. ముక్క
ఉగాది ఉత్సవంలో బోనాల జాతర.. షడ్రుచుల పచ్చడితో పాటే చుక్కా.. ముక్క
టోల్ టాక్స్‌పై వారంలో కీలక ప్రకటనః గడ్కరీ
టోల్ టాక్స్‌పై వారంలో కీలక ప్రకటనః గడ్కరీ
టీ పొడితో కోట్ల రూపాయల వ్యాపారం..మహారాష్ట్ర మహిళ సక్సెస్ మంత్రం
టీ పొడితో కోట్ల రూపాయల వ్యాపారం..మహారాష్ట్ర మహిళ సక్సెస్ మంత్రం
ముస్లిం అయి ఉండి ఇలాంటి పనులెందుకు చేస్తున్నావ్? సారా సమాధానమిదే
ముస్లిం అయి ఉండి ఇలాంటి పనులెందుకు చేస్తున్నావ్? సారా సమాధానమిదే
వైజాగ్ మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన టీమిండియా మాన్‌స్టర్
వైజాగ్ మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన టీమిండియా మాన్‌స్టర్
ఈ 5 బైక్‌లు అంటే జనాలకు పిచ్చి.. మార్కెట్లో భారీ డిమాండ్‌..!
ఈ 5 బైక్‌లు అంటే జనాలకు పిచ్చి.. మార్కెట్లో భారీ డిమాండ్‌..!
మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. ఆకర్షిస్తున్న రివోల్ట్ నయా ఈవీ బైక్
మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. ఆకర్షిస్తున్న రివోల్ట్ నయా ఈవీ బైక్
బాబోయ్.. రోజు ముక్క పచ్చి కొబ్బరి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
బాబోయ్.. రోజు ముక్క పచ్చి కొబ్బరి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?