బాదంపప్పు ధర ఎక్కువని పక్కకు పెట్టారా.. ఈ 3 చవకైన ఆహారాలను ఉదయం తినే ఆహారంలో చేర్చుకోండి
చాలామంది నానబెట్టిన బాదంపప్పును ఖాళీ కడుపుతో తింటారు. బాదంపప్పును నానబెట్టడం తినడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అయితే నీటిలో నానబెట్టి ఖాళీ కడుపుతో తినగలిగేది బాదంపప్పు అని అనుకుంటారు. బాదంపప్పు ధర చాలా ఎక్కువ. దీంతో బాదం పప్పులను తినడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. బాదంపప్పులకు బదులు నీటిలో నానబెట్టిన ఈ మూడు ఆహారాలను తినవచ్చు.
శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం మించిన మెడిసిన్ లేదు. శారీరక శ్రమ, వ్యాయామం తో పాటు రోజూ తినే ఆహారంలో పోషకాలు, ప్రోటీన్లు ఉంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రోజు వారీ ఆహారంలో ఏమి తీసుకుంటారో దానిని బట్టి వ్యాధి ప్రమాదం తగ్గుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. రోజుని అత్యంత ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారంతో మొదలు పెట్టాలి. ముఖ్యంగా చాలామంది నానబెట్టిన బాదంపప్పును ఖాళీ కడుపుతో తింటారు. బాదంపప్పును నానబెట్టడం తినడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అయితే నీటిలో నానబెట్టి ఖాళీ కడుపుతో తినగలిగేది బాదంపప్పు అని అనుకుంటారు. బాదంపప్పు ధర చాలా ఎక్కువ. దీంతో బాదం పప్పులను తినడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. బాదంపప్పులకు బదులు నీటిలో నానబెట్టిన ఈ మూడు ఆహారాలను తినవచ్చు.
ఎండు ద్రాక్ష: నానబెట్టిన ఎండుద్రాక్షను ఉదయం ఖాళీ కడుపుతో తినవచ్చు. ఎండుద్రాక్షలో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఎండు ద్రాక్ష శారీరక బలహీనతను దూరం చేయడమే కాదు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఎండుద్రాక్షను ముందు రోజు రాత్రి 10-15 గంటలు నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్షను తినండి. ఎండు ద్రాక్షను ననాబెట్టిన నీరు కూడా త్రాగవచ్చు. ఇలా చేయడం వలన గ్యాస్ , గుండెల్లో మంట సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
పెసలు: ఖాళీ కడుపుతో నీరు త్రాగడానికి మించినది ఏమీ లేదు. అయితే నానబెట్టిన పచ్చి పెసలను కూడా అల్పాహారంగా తినవచ్చు. పెసలను మొలకలుగా చేసుకుని కూడా తినొచ్చు. పచ్చి పెసల్లో ప్రొటీన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వలన బరువు తగ్గడమే కాదు మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
మెంతి గింజలు: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు జుట్టు, చర్మ సమస్యలను తగ్గించడంలో మెంతులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతుల నీటిని త్రాగండి. ఇలా చేయడం వలన షుగర్ కు మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మెంతుల నీరు కడుపుని చల్లగా ఉంచుతుంది. అజీర్ణాన్ని నివారిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏమైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)