హోటల్ రూమ్ లో వైట్ బెడ్ షీట్స్, టవల్స్ కనిపిస్తాయి.. ఇలా ఎందుకు తెల్లని బట్టలు యూజ్ చేస్తారో తెలుసా..
వ్యాపారం కోసం లేదా పర్యాటకం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఉండడం కోసం హోటల్స్ ను ఆశ్రయిస్తారు. ఇలా హోటల్ రూమ్ లోకి అడుగు పెట్టిన వెంటనే అందంగా మల్లెపువ్వులా తెల్లగా కనిపించే బెడ్ షీట్, దానితో పాటు తెల్లటి కవర్లు ఉన్న దిండు, టవల్స్, చేతి రుమాళ్లు కనిపిస్తాయి. అయితే ఇలా రూమ్ లో ఉన్న క్లోత్స్ తెల్లగా ఉండడం గమనించి ఉంటారు. అయితే ఇలా అన్నీ తెలుపు రంగులోనే లోనే ఎందుకు ఉంటాయనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా..